మహిళల కోసం సూపర్ ఫుడ్స్!
వయసుతోపాటే ఆరోగ్య సమస్యలూ పెరుగుతాయి. కీళ్లనొప్పులు మొదలవుతాయి. మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో మహిళలకు ‘సూపర్ ఫుడ్స్' కావాలి
వయసుతోపాటే ఆరోగ్య సమస్యలూ పెరుగుతాయి. కీళ్లనొప్పులు మొదలవుతాయి. మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో మహిళలకు ‘సూపర్ ఫుడ్స్’ కావాలి.
పాలు: వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్లలో ఎముకల సాంద్రత తగ్గిపోతూ వస్తుంది. ఆస్టియోపోరోసిస్లాంటి వ్యాధులు చుట్టుముడతాయి. తగిన మోతాదులో పాలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి. ఇందులోని క్యాల్షియం ఎముకలతో ముడిపడిన వ్యాధుల్ని నివారిస్తుంది.
పెరుగు: మధ్య వయసు స్త్రీలలో శారీరక, మానసిక సమస్యలు సాధారణం. నిత్యం పెరుగు తీసుకోవడం వల్ల మెనోపాజ్‌కు ముందు వచ్చే మానసిక ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. ఇందులో క్యాల్షియం, విటమిన్-బి12, రిబోఫ్లేవిన్‌లు పుష్కలం.
బ్రెజిల్ నట్స్: మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్న వయోధిక మహిళలకు బ్రెజిల్ నట్స్ ఔషధంలా పని చేస్తాయి. ఇందులోని మెగ్నీషియం కండరాల బలహీనత, అలసట, తిమ్మిర్లలాంటి లక్షణాలను తగ్గిస్తుంది.
బ్లూ బెర్రీలు: వృద్ధాప్యంలో కనిపించే మతిమరుపు వ్యాధిని తగ్గించేందుకు బ్లూబెర్రీలు సాయపడతాయి. ఇందులోని విటమిన్-సి, కె, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
పులియబెట్టిన క్యాబేజీ: సావర్క్రౌట్ లేదా ఫెర్మెంటెడ్ క్యాబేజీగా పిలిచే పులియబెట్టిన క్యాబేజీలో లాక్టిక్ యాసిడ్, టైరమిన్స్, ఫైటో ఈస్ట్రోజెన్స్, విటమిన్-ఎ, సి, మినరల్స్, పొటాషియం, ఐరన్, ఫోలేట్స్ ఉంటాయి. అందువల్లే సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇది మానసిక సమస్యలకు మందుగా పనిచేయడంతో పాటు ఎముకల ఆరోగ్యానికి, రొమ్ము క్యాన్సర్ ముప్పు నివారించడానికి సాయపడుతుంది.
పాలకూర: ఇందులోఅధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఎ లాంటివీ ఉంటాయి. ఇందులోని ఫినోలిక్ కాంపౌండ్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గించి వృద్ధాప్యాన్ని వాయిదా వేస్తాయి.
అవిసె గింజలు : వీటిలో ఫైటో ఈస్ట్రోజెన్లు, లినోలెనిక్ యాసిడ్, విటమిన్-ఎ,సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఈస్ట్రోజెన్లు హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడతాయి. వయసుతో పాటు సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోకుండా నిలువరిస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- bones
- calcium
- energy
- Super foods
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

