తరుగు లేని మార్పు
ఉన్నంతలో కొంతైనా తరగని ‘నగ’వులు చిందిస్తూ శుభకార్యాల వేళ తమ పరువు పోకుండా కాపాడుకోవాలని సగటు మహిళ ఆరాటపడుతున్న రోజులివి. ఆడపిల్ల పెండ్లికి పెట్టిపోతల కాడ వెనక్కి తగ్గితే ప్రతిష్ఠకు భంగం కలుగకూడదన్న ధ్యాసలో ఆర్థిక భంగపాటుకు గురవుతున్న కుటుంబాలెన్నో. బంగారంతో ముడిపడి ఉన్న ఈ సందర్భాలన్నీ కొందరికి తిరుగులేని వ్యాపారంగా మారితే ఇంకొందరి జీవితాలు ఆర్థికంగా ‘తరిగి’పోయేలా చేస్తున్నాయి.
ఉన్నంతలో కొంతైనా తరగని ‘నగ’వులు చిందిస్తూ శుభకార్యాల వేళ తమ పరువు పోకుండా కాపాడుకోవాలని సగటు మహిళ ఆరాటపడుతున్న రోజులివి. ఆడపిల్ల పెండ్లికి పెట్టిపోతల కాడ వెనక్కి తగ్గితే ప్రతిష్ఠకు భంగం కలుగకూడదన్న ధ్యాసలో ఆర్థిక భంగపాటుకు గురవుతున్న కుటుంబాలెన్నో. బంగారంతో ముడిపడి ఉన్న ఈ సందర్భాలన్నీ కొందరికి తిరుగులేని వ్యాపారంగా మారితే ఇంకొందరి జీవితాలు ఆర్థికంగా ‘తరిగి’పోయేలా చేస్తున్నాయి. ఇవన్నీ దగ్గరగా చూస్తూ చలించిపోయిన ఆమె తిరుగులేని ఆలోచన తరుగు బెడదను రూపుమాపేలా చేసింది. అంతేనా.. ఆధునికతకు ‘సృజనా’త్మకత తోడవటంతో జువెలరీ రంగానికి కొత్త మెరుపూ వచ్చినట్టయింది! సాంప్రదాయిక నగల వ్యాపారానికి టెక్నాలజీ సొబగులను అద్దుతూ వినూత్న రీతిలో ఆంత్రప్రెన్యూర్‌షిప్ కొనసాగిస్తున్న చదలవాడ సృజన గురించి ఈ వారం స్టార్టప్ స్టోరీస్. ఆమె మాటల్లోనే..
తిరిగి అమ్ముకుంటే కనీస ధర కూడా రాని బంగారు నగలపై సాధారణ కుటుంబాలు పెద్ద మొత్తంలో వెచ్చించడం నన్ను ఆలోచనలో పడేసింది. ఆరుగాలం కష్టపడి సంపాదించే సాధారణ రైతుల నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టే కార్మికుల వరకు అందరూ నగలు, బంగారం కొనుగోలు చేయడంలో చేస్తున్న తప్పిదాలు నన్ను పరిష్కార మార్గం వైపు నడిపించాయి. నలుగురికి మంచి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగిన నేను ‘రేవా జువెల్స్’కు సహ వ్యవస్థాపకురాలిగా ఎదగడం ఆనందంగా ఉంది.
వీ హబ్‌లోనే బీజం
నేను పుట్టింది వ్యవసాయ కుటుంబమే. బీటెక్ చేసిన నాన్న భారత సైన్యానికి సేవలు అందించారు. నేను కూడా ఆయన బాటనే ఎంచుకొని ఐఐటీలో కాలు మోపాను. కెమికల్ ఇంజినీరింగ్ రంగంలో సాంకేతిక విద్యాభ్యాసం తర్వాత వీ హబ్‌తో కలిసి నడిచే అవకాశం వచ్చింది. వీ హబ్‌కు నేర్చుకునేందుకు వచ్చే చాలా మంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని వార్షికంగా 9 శాతం రాబడి లేని బంగారంపై పెట్టుబడి పెట్టడం, అంతకు మించి రాబడినిచ్చే మార్గాలపై అవగాహన లేకపోవటాన్ని గ్రహించాను. అవ్యవస్థీకృతంగా ఉన్న నగల వ్యాపారాన్ని ఆధునీకరించాలనే ఉద్దేశంతోనే రేవాను ప్రారంభించాం.
జువెలరీ మేకింగ్‌లో ఏఐ టెక్నాలజీ
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం క్రమంగా పెరుగుతున్నది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వస్తున్నది. వీటి సాయంతో అతి తక్కువ ఖర్చులోనే డిజైన్లను రూపొందించే విధానంపై అధ్యయనం చేస్తున్నాం. అందుకు దేశంలోని ప్రధాన జువెలరీ తయారీదారుల భాగస్వామ్యంతో పనిచేసేలా జీరో ఇన్వెంటరీ, లెస్ క్యాపిటల్‌తో జువెలరీ మేకింగ్ రంగంలోకి అడుగుపెట్టాం. అయితే సాంప్రదాయిక విధానాలకు విభిన్నంగా ఉండేలా కెమికల్ ఇంజినీరింగ్ చేసిన తనతోపాటు రాకెట్ తయారీలో మెటలర్జికల్ ఇంజినీర్లు, మిశ్రమధాతులను అందించే నిపుణుల సాయంతో రేవాకు ప్రాణం పోశాం. ప్రధాన జువెలరీ సంస్థలు, గ్రామీణ స్థాయిలో జరిగే బంగారం, బంగారు నగల క్రయవిక్రయాల్లో తరుగు, రాళ్ల రూపంలో జరుగుతున్న నష్టభారాన్ని తగ్గించడమే రేవా లక్ష్యం. బడ్జెట్ అంచనాల ప్రకారమే కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా తక్కువ వేస్టేజీ, మోల్డింగ్ విధానాల ద్వారా నాణ్యమైన నగలను అందిస్తున్నాం. మార్కెట్లో దొరికే బంగారు, డైమండ్ నగల ఖరీదుతో పోల్చితే చాలా తక్కువ ఖర్చులో అదే క్వాలిటీ, లెస్ వేస్టేజీ, అతి తక్కువ మేకింగ్ ఛార్జీలతో నాణ్యమైన, ఆకర్షణీయమైన
డిజైన్లలోనగలను తయారుచేస్తున్నాం.
– కడార్ల కిరణ్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

