కావలసిన పదార్థాలు
మీల్మేకర్ (సోయా చంక్స్): ఒక కప్పు, మైదా పిండి: అరకప్పు, గుడ్లు: రెండు, బ్రెడ్ క్రంబ్స్: అర కప్పు, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, గడ్డ పెరుగు: ఒక టేబుల్ స్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
మీల్‌మేకర్‌ను పది నిమిషాలపాటు వేడినీళ్లలో నానబెట్టాలి. ఒక గిన్నెలో మీల్మేకర్, కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచెయ్యాలి. ఒక గిన్నెలో గుడ్లు వేసి చిటికెడు ఉప్పు కలపాలి. మరో గిన్నెలో మైదా, బ్రెడ్ క్రంబ్స్, చిటికెడు ఉప్పు, అర టీస్పూన్ కారం కలగలపాలి. ఇప్పుడు మీల్మేకర్లను గుడ్డు మిశ్రమంలో ముంచి, పిండి మిశ్రమంలో బాగా దొర్లించి విడివిడిగా కాగిన నూనెలో వేయాలి. సన్నని మంటపై దోరగా కాల్చుకుంటే సోయా పాప్‌కార్న్ సిద్ధం.