మనదేశంలో ఎన్ని రకాల కప్పలు ఉన్నాయో మీకు తెలుసా? కనీసం, ఎన్ని లక్షల సంవత్సరాల నుంచీ కప్పలు ఈ భూమి మీద బతుకుతున్నాయో తెలుసా? ఆ విషయాలన్నీ సోనాలి గార్గ్‌కు బాగా ఎరుక. 2014 2021 మధ్యకాలంలో ఆమె కొత్తగా కనుగొన్న కప్ప జాతుల సంఖ్య యాభై. వాటిలో అంతరించిపోతున్నవీ ఉన్నాయి. హిమాలయాల్లో అత్యంత అరుదుగా కనిపించే ఓ కప్పజాతి ఇప్పుడు పశ్చిమ కనుమలలో తలదాచుకుంటున్నది. ఆ విషయాన్ని తన విస్తృత పరిశోధనల ద్వారా కనుగొన్నది సోనాలి. పరిశోధక విద్యార్థిగా కప్పలపై పీహెచ్డీ చేసింది సోనాలి. ఈ ప్రయాణంలో ఆమెకు ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఎస్.డి.బిజు మార్గదర్శకులుగా ఉన్నారు. ఆయన ‘ఫ్రాగ్మాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధిచెందారు. డీఎన్ఏను ఉపయోగించి కప్పల పరిణామ క్రమాన్ని తెలుకుంటున్నది సోనాలి. కప్పలు మూడు కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై బతుకుతున్నాయని ఆమె తేల్చింది. యాభై కొత్త కప్ప జాతులను కనుగొన్నందుకుగాను ఆమెకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ‘ఎడ్వర్డ్ ఓ. విల్సన్ బయోడైవర్సిటీ పోస్ట్‌డాక్టొరల్’ ఫెలోషిప్ లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని పిల్ఖువా.. సోనాలి సొంతూరు.