Sobhita Dhulipala | తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నది శోభిత ధూళిపాల. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న శోభిత.. ఆటవిడుపు కోసం శ్రీలంక వెళ్లింది. అక్కడి ప్రకృతి అందాలకు పరవశించిపోతూ.. తన భావుకతతో, ఛాయా చిత్రాలతోశ్రీలంకను సప్తవర్ణ శోభితంగా మారుస్తున్నది. తాను ఆస్వాదించిన ప్రతి అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నది. ‘నా హృదయమనే పక్షి.. రెక్కలల్లార్చి స్వేచ్ఛగా విహరిస్తున్నది’ అంటూ తనలోని రచయిత్రిని మేల్కొలిపింది. చేనేత చీర కట్టులో, కొబ్బరికాయ పట్టుకుని శోభిత దిగిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. బాలీవుడ్లో ఆదిత్యరాయ్ కపూర్‌తో కలిసి ‘నైట్ మేనేజర్’రీమేక్‌లో నటిస్తున్నది శోభిత. తెలుగు ‘గూఢచారి’కి సీక్వెల్‌గా వస్తున్న ‘మేజర్’లోనూ తనే హీరోయిన్.