వాడని పూలే వ్యాపారం.. అదరగొడుతున్న అక్కాచెల్లెళ్లు
Yeshoda and Rhea Sisters | కన్నడిగులకు శ్రావణమాసం పవిత్రమైంది. ప్రతి ఇంటా నిత్యం పూజలూ వ్రతాలే. బెంగళూరు వాసులూ ఇందుకు మినహాయింపు కాదు. ‘తెల్లారిపోతున్నది. ఇంకా నిద్రెలాపడుతుంది యశోదా? మార్కెట్‌కు వెళ్లి పూజకు పూలు తీసుకురా’ అంటూ తల్లిపోరు. ‘అమెరికా నుంచి వచ్చినా.. నీ గోల తప్పదా’ అంటూ యశోద విసుగ్గా మంచం దిగింది. ‘త్వరగా వెళ్లు తల్లీ! ఎండపడితే పూలు వాడిపోతాయి. పూజకు పనికిరావు’ అంటూ బుజ్జగిస్తున్న తల్లిని చూస్తూ ఆలోచనలో పడింది యశోద. ఏ పువ్వయినా రెండు రోజులకు మించి నిల్వ ఉండదు. అంటే, మార్కెట్‌కు వచ్చే సగానికి సగం పూలు జనానికి చేరవు. వాడిపోయి చెత్తపాలు అవుతాయి. ఎంత వృథా! పూల జీవితకాలాన్ని పెంచలేమా?’ అన్న ఆలోచనే, యశోదను ఆంత్రప్రెన్యూర్ను చేసింది. ‘హూవు ( Hoovu )’ అనే స్టార్టప్‌కు అదే పునాది.
అక్కాచెల్లెళ్లు
యశోద వాషింగ్టన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. స్టాన్‌ఫర్డ్‌లో చదువుతున్న చెల్లి రియాతో కలిసి పూల వ్యాపారం ప్రారంభించింది. ఆమె తండ్రి రామకృష్ణకు కెన్యాలో గులాబీలు పండించిన అనుభవం ఉంది. ఆ నైపుణ్యంతోనే ఆయన ప్రత్యేకమైన గ్యాస్‌తో బ్యాక్టీరియా, తేమ లేకుండా గులాబీలను శుభ్రం చేస్తే దాదాపు పదిహేను రోజులవరకూ పూలు సహజత్వాన్ని కోల్పోవని సలహా ఇచ్చారు. అవసరమైన సామగ్రిని తెప్పించి ఇచ్చారు. అలా ప్రాసెస్ చేసిన పూలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. పది లక్షల పెట్టుబడితో మొదలైన వ్యాపారం నెలకు లక్షన్నరకు పైగా ఆర్డర్లతో పదిరెట్లు వృద్ధి చెందింది. చాలా దేవాలయాలు ‘హూవు’ సేవలు వినియోగించుకుంటున్నాయి. త్వరలోనే ‘పూజా కిట్’ పేరుతో పూజా సామగ్రి వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారీ అక్కాచెల్లెళ్లు.
Read More :
“టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్‌స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”
“అమెరికా వర్జీనియాలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ మహిళ”
ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివి ఛాయ్ అమ్ముకుంటున్న యూత్.. ఎందుకింత క్రేజ్ !!”
వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి.. ముఖేశ్ అంబానీ గారాలపట్టి చెప్పిన విజయసూత్రాలివే..”
“అప్పుడు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది.. ఇప్పుడు అవార్డులు అందుకుంటుంది”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- flowers
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

