మహిళలు, ఆడపిల్లల సేఫ్టీకి ప్రతి ఒక్కరూ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నేటి పరిస్థితుల్లో ఇవ్వాలి కూడా. మనకు ప్రియమైన వాళ్లు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా సేఫ్‌గా ఉన్నారనే భరోసా టెక్నాలజీతో లభిస్తుంది. అందుకే చాలా కంపెనీలు మొబైల్ యాప్స్ తయారీకి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే చాలా సేఫ్టీ యాప్‌లు వినియోగంలో ఉన్నాయి. సైలెంట్ బీకన్ (Silent Beacon) యాప్ ఈ తరహాదే! మహిళలు, చిన్నపిల్లలు, ఉద్యోగినులకు సెక్యూరిటీ గార్డ్‌గా ఇది పనిచేస్తుంది. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి సైలెంట్ బీకన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలతో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత పేరు, వయసు సహా తదితర వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత కుటుంబసభ్యులు లేదా గార్డియన్లకు చెందిన 8 మంది వివరాలను ఎంటర్ చేయాలి. ఎమర్జెన్సీ సమయంలో 911 నంబర్ లేదా మీరు ఎంపిక చేసుకున్న 8 మందికి అలర్ట్ పంపే విధంగా ఆప్షన్ ఎంచుకోవచ్చు. మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, మెయిల్స్ ద్వారా కూడా అలర్ట్‌లు అందుతాయి. ఇప్పటికే ఈ అప్లికేషన్‌ను పదిలక్షల మందికిపైగా ఇన్స్టాల్ చేసుకుని సేఫ్జోన్లో జీవన యానం కొనసాగిస్తున్నారు.