సొగసుకు వేద్దాం.. మేలి ముసుగు
ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి సీజన్‌కు ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొస్తుంది. ఈ ఏడాది స్టయిల్ ప్రియులను ఆకట్టుకుంటున్న ట్రెండ్ షీర్ లేయరింగ్. పారదర్శక వస్ర్తాలను హుందాగా, సొగసుగా ఇతర దుస్తులతో కలిపి ధరించే ఈ శైలి అంతర్జాతీయ ర్యాంప్‌ల నుంచి సాధారణ వార్డ్‌రోబ్‌ల వరకు చేరుకుంది.
ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి సీజన్‌కు ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొస్తుంది. ఈ ఏడాది స్టయిల్ ప్రియులను ఆకట్టుకుంటున్న ట్రెండ్ షీర్ లేయరింగ్. పారదర్శక వస్ర్తాలను హుందాగా, సొగసుగా ఇతర దుస్తులతో కలిపి ధరించే ఈ శైలి అంతర్జాతీయ ర్యాంప్‌ల నుంచి సాధారణ వార్డ్‌రోబ్‌ల వరకు చేరుకుంది. ఈ మేలి ముసుగు స్టయిల్‌తోపాటు సౌకర్యాన్నీ అందిస్తుండటంతో యువత ఎక్కువగా దీన్నే ఎంచుకుంటున్నది. పారదర్శకంగా ఉండే ఇవి బయటి లోపల దుస్తుల రంగులను విభిన్నంగా చూపిస్తూ కొత్త అందాన్ని తీసుకొస్తాయి.
షర్ట్లు, ఆర్గంజా జాకెట్లు, మెష్ టాప్స్, నెట్ష్రగ్లు ఈ ట్రెండ్‌లో ప్రధాన ఆకర్షణలు. వీటిని సాధారణ టీ-షర్ట్, ట్యాంక్ టాప్ లేదా కుర్తీపై లేయర్‌గా ధరిస్తే లుక్కు కొత్తదనం వస్తుంది. చీరలపై షీర్ కేప్స్, లెహంగాలపై పారదర్శక జాకెట్లు కూడా ఇప్పుడు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ట్రెండ్‌లో రంగుల ఎంపిక కూడా కీలకం. పాస్టెల్ షేడ్స్ (లేత వన్నెలు), ఐవరీ, పీచ్, స్కై బ్లూ, లావెండర్ వంటి రంగులు మరింత సొగసును తీసుకొస్తాయి.
ముత్యాల ఆభరణాలు, మినిమల్ హ్యాండ్‌బ్యాగ్, సింపుల్ హీల్స్‌తో జత చేస్తే స్టయిలిష్ లుక్ పూర్తవుతుంది. అయితే, షీర్ దుస్తులు ధరించేటప్పుడు మరీ ఎక్కువ పారదర్శకంగా కనిపించకుండా సరైన ఇన్నర్‌వేర్, ఫ్యాబ్రిక్ ఎంపికపై శ్రద్ధ అవసరం. ట్రెండ్‌ను హుందాతనంతో మేళవించినప్పుడే అసలైన ఫ్యాషన్ మెరుస్తుంది. అందుకే ఈ సీజన్లో వార్డ్‌రోబ్‌కు షీర్ లేయరింగ్ను జోడించాలని స్టయిలిస్ట్‌లు సూచిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

