అందం వెనక ఆవేదన..
బాలీవుడ్లో నటించిన తొలి మూవీలోనే వర్ణ వివక్ష, బాడీ షేమింగ్ ఎదురొన్నానని వాపోయింది సీనియర్ నటి సమీరా రెడ్డి. సోహైల్ ఖాన్ హీరోగా వచ్చిన ‘మైనే దిల్ తుఝ్కో దియా’ టైమ్‌లో తన సిన్ టోన్ కంటే మూడు షేడ్స్ తకువ ఉన్న ఫౌండేషన్ వాడమన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
బాలీవుడ్లో నటించిన తొలి మూవీలోనే వర్ణ వివక్ష, బాడీ షేమింగ్ ఎదురొన్నానని వాపోయింది సీనియర్ నటి సమీరా రెడ్డి. సోహైల్ ఖాన్ హీరోగా వచ్చిన ‘మైనే దిల్ తుఝ్కో దియా’ టైమ్‌లో తన సిన్ టోన్ కంటే మూడు షేడ్స్ తకువ ఉన్న ఫౌండేషన్ వాడమన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్ అంటే కచ్చితంగా తెల్లగా ఉండాలనే రూల్స్ పెట్టడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పింది. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ మొదట్లో ఎదురొన్న ఇబ్బందుల గురించి ఓపెన్ అవుతూ ఈ విషయాలను గుర్తుచేసుకుంది.
ఆ మేకప్ వల్ల తాను స్రీన్ మీద దాదాపు గ్రే కలర్లో కనిపించేదాన్నని చెప్పింది. బయట సమాజంలోనే కాదు, సొంత కుటుంబాల్లో కూడా అమ్మాయిలను నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటూ పేరెంట్స్, అత్తమామలు వేధించడం దారుణమని, అసలు అందానికి నిర్వచనం ఎవరు ఇచ్చారని ప్రశ్నించింది. బాలీవుడ్ తన నుంచి కోరుకున్న గ్లామర్ లుక్ కోసం తన పర్సనల్ లైఫ్‌ను, నమ్మకాలను పూర్తిగా పకన పెట్టేయాల్సి వచ్చిందని వాపోయింది.
ఆ అభద్రతాభావం నుంచి బయటికి రావడానికి తనకు దాదాపు 20 ఏండ్ల సమయం పట్టిందని ఎమోషనల్ అయింది. కేవలం ఇండస్ట్రీ కోసం ప్యాడెడ్ బ్రాలు, బమ్ ప్యాడ్స్, కలర్ కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతూ బతికేసినట్లు ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. డ్రెస్ డిజైనర్లు కూడా తన బాడీ షేప్ గురించి కామెంట్స్ చేస్తూ ఒత్తిడి తెచ్చేవారని, తన బట్టలన్నిటికీ ఇన్-బిల్ట్ ప్యాడ్స్ కుట్టించేవారని సంచలన విషయాలు బయటపెట్టింది. టాలీవుడ్‌కు సమీరా రెడ్డి ఎంతో సుపరిచితం.
మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవా, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో అశోక్, నరసింహుడు లాంటి పెద్ద సినిమాల్లో నటించి ఇకడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్‌లో అదరగొట్టిన ఈ బ్యూటీ వెనుక ఇంతటి మానసిక సంఘర్షణ ఉందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 14 ఏండ్లపాటు వెండితెరకు దూరంగా ఉన్న సమీరా రీసెంట్గా అభిజిత్ మోహన్ వరాంగ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆఖ్రీ సవాల్’ అనే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. సంజయ్ దత్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో సమీరా నటనకు మంచి మారులే పడ్డాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

