బెండకాయ అంటేనే పోషకాల గని. ఫైబర్ పుష్కలం. మలబద్ధకం లాంటి సమస్యలు రానేరావు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలూ అనేకం. కొలెస్ట్రాల్‌కూడా నియంత్రణలో ఉంటుంది. మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. అందుకే, ‘బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని’ అంటారు. ‘పచ్చబెండకు చిట్టి తమ్ముడు అయిన ఎర్రబెండ ఆరోగ్యానికి మరింత మంచిదనీ’ అంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటెబుల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ రకాన్ని అభివృద్ధి చేశారు. రైతుల్లో అవగాహన లేకపోవడంతో పెద్దగా పండించడం లేదు. దీంతో, ధర కొంత ఎక్కువగానే ఉంటున్నది. అయితేనేం, పోషక విలువలు మాత్రం అనేకం. ఎర్ర బెండకాయలో విటమిన్-ఎ, విటమిన్-బి, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. బరువు తగ్గడంతో సాయపడతాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. కొసమెరుపు ఏమిటంటే, ఎర్ర బెండకాయ వండిన తర్వాత మాత్రం ఎర్రగా ఉండదు!