టాలీవుడ్లో సత్తాచాటి బాలీవుడ్లో పాగా వేసిన బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్. ఇటీవల కొంత గ్యాప్ ఇచ్చినా.. ఈ అమ్మడు మళ్లీ కెరీర్లో దూసుకుపోతున్నది. కమల్‌హాసన్, శంకర్ కాంబో ‘ఇండియన్ 2’లో అవకాశం కొట్టేసింది. కమల్‌హాసన్‌తో నటించడం గొప్ప వరం అంటున్న రకుల్.. మరెన్నో సంగతులు పంచుకుందిలా..
నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు అది కనుమరుగైంది. సినిమా ఎన్ని రోజులు ఆడిందనే లెక్కలు మారిపోయాయి. ఫలానా చిత్రం విజయ వంతమైందా లేదా అనేది ఆ సినిమా వసూళ్లపై ఆధారపడుతున్నది.
ఒకప్పుడు పోస్టర్లు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవి. ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉంటే ఓపెనింగ్స్ బాగుండేవి. రెండు వారాల తర్వాత ప్రేక్షకుల అభిప్రాయమే సినిమాకు ప్రచారంగా పనిచేసేది. పబ్లిక్టాక్ బాగుంటే సినిమాలు వందరోజుల మార్క్ దాటేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ప్రతి ఒక్కరూ విశ్లేషకులు అయిపోతున్నారు. సినిమా భవిష్యత్తును వాళ్లే నిర్ణయిస్తున్నారు.
కమల్ సార్‌తో కలిసి పనిచేయాలని ఎవరికైనా ఉంటుంది. అందుకు నేను మినహాయింపు కాదు. ‘ఇండియన్ 2’తో ఆ కల నెరవేరుతున్నది. ఈ సినిమాలో ఆయన 90 ఏండ్ల కురువృద్ధుడిగా కనిపిస్తారు. అలా కనిపించడానికి ఆయన ఎంతగా కష్టపడుతున్నారో ప్రత్యక్షంగా చూశాను. తెల్లవారుజామున 5 గంటలకు షూటింగ్ స్పాట్‌కు చేరుకుంటారు. మేకప్ కోసం ఐదు గంటలు అలా కూర్చునే ఉంటారు. పది గంటలకు సెట్లో ఉంటారు. షూటింగ్ పూర్తయ్యాక మేకప్ తొలగించడానికి మరో రెండు గంటలు పడుతుంది. నటన పట్ల ఆయన నిబద్ధత ఇతర నటీనటులకు స్ఫూర్తినిస్తుంది.
కెరీర్ పరంగా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నా. ఐదు సినిమాల్లో నటిస్తున్నా. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కమల్ సార్ సినిమా ‘ఇండియన్ 2’లో అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. దర్శకుడు శివకార్తికేయన్ ‘అయలాన్’ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ‘ఛత్రీవాలీ’ త్వరలోనే విడుదల కానుంది. మరో యాక్షన్ థ్రిల్లర్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.
వందేండ్ల సినిమాలో కమల్ సార్ జర్నీ దాదాపు అరవై సంవత్సరాలు. సినిమా గురించి ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో! అమితాబ్ సార్, కమల్ సార్ నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. ఇక, ఏ రంగంలో అయినా సరే నిత్య విద్యార్థిగా ఉంటేనే రాణించగలం. ‘నాకు అన్నీ తెలుసు’ అనుకోవడం మొదలైనప్పటి నుంచి ఎదుగుదల కుంటుపడుతుంది.