ఆహారంతో.. దుర్వాసన దూరం

ఆరోగ్యంగా ఉండటం అంటే.. జ్వరం, దగ్గు, జలుబు వగైరా ఇబ్బందులు లేకపోవడం మాత్రమే కాదు. మనం తేలిగ్గా తీసిపారేసే చిన్న విషయాలే చికాకులకు కారణం అవుతాయి. శరీరం నుంచి వెలువడే దుర్వాసనకూడా అలాంటిదే. దీనికి పరిష్కారం.. పరిశుభ్రత ఒక్కటే కాదు, మంచి ఆహారం తీసుకోవడం కూడా.
ఇవి వద్దు..
- ప్రాసెస్డ్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. ఇవి నోటికి రుచిని అందించినా ఆరోగ్యానికి హాని
- కరమే. అందులో రిఫైన్డ్ పిండి, చక్కెర, ఉప్పు, హైడ్రోజనరేటెడ్ నూనెలు కలుపుతారు. పైగా పీచు పదార్థాలు ఉండవు.
- రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే, అది శరీరంలో నిల్వ ఉంటూ పేగులద్వారా రక్తంలోకి మలినాలను చేరుస్తుంది.
- మద్యపానంతోపాటు కార్బొనేటెడ్ డ్రింక్స్కూడా శరీర దుర్వాసనకు తావిస్తాయి.
ఏం తినాలి?
- ఆహారంలో వీలైనన్ని ఎక్కువ ఆకుకూరలను చేర్చు
- కోవాలి. వీటిలోని క్లోరోఫిల్‌కు శరీర దుర్వాసనను దూరం చేసే గుణం ఉంటుంది.
- ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తినాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు దూరమై జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది.
- ప్రోబయాటిక్ ఫుడ్ మంచి బ్యాక్టీరియాను చైతన్యవంతం చేసి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.
మయూరి ఆవుల,
న్యూట్రిషనిస్ట్,
www.trudiet.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- body smell
- diet
- Healthy food
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

