పగలు కాసేపు కునుకుతీస్తున్నప్పుడు కూడా కొంతమందికి కలలు వస్తాయి. అందుకేనేమో, ‘పగటి కలలు పనికి చేటు, రాత్రి కలలు నిద్రకు చేటు’ అంటారు పెద్దలు. కానీ, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ‘ఫాదర్ ఆఫ్ ది డే డ్రీమింగ్ రీసెర్చి’ జెరోమ్ సింగర్ తన అధ్యయనం ద్వారా, పగటికలలు మంచిదేననీ, పాజిటివ్ ఎఫెక్ట్ను అందిస్తాయని నిర్ధారించారు. రగ్బీ ప్లేయర్స్, గోల్ఫర్స్, మార్షల్ ఆర్ట్స్ అభ్యసిస్తున్న వాళ్లకు మంచిమంచి టెక్నిక్స్ అన్నీ పగటి కలల్లోనే వస్తాయట. అంతేకాదు సంగీత కళాకారులు, సర్జన్స్కు కూడా పగటి కలల్లో తమ వృత్తికి సంబంధించిన చిట్కాలు దర్శనమిస్తాయట. కొన్ని కలలు డిప్రెషన్ తీవ్రతను తగ్గిస్తాయనికూడా ఈ అధ్యయనం వెల్లడించింది.