మీ ఇంట్లోనే ఈజీగా కంపోస్ట్ ఎరువు రెడీ చేసుకోవచ్చు
వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చని మనకు తెలుసు. మొక్కల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే ఈ సేంద్రియ ఎరువు తయారీకి నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది. ఇందుకు కొంత స్థలమూ కావాలి. ఆ ఇబ్బంది లేకుండా, వారం రోజుల్లోనే తయారు చేసుకోగలిగేలా ‘వెప్రా కంపోస్ట్ కిట్ ( Vapra Home Composting Kit )’ను రూపొందించారు హైదరాబాద్‌కు చెందిన పావని లొల్లా ( Pavani Lolla ).
ఇంట్లోనే కంపోస్ట్ ఎరువును సిద్ధం చేసుకునేందుకు సాయపడుతుందీ కిట్. ఎరువు తయారీని వేగవంతం చేసేలా ఓ గ్రీన్ మిక్స్‌ను రూపొందించిందీ సంస్థ. హోమ్ కంపోస్ట్ కిట్‌తో పాటు గ్రీన్ మిక్స్ పొట్లం, కంపోస్టింగ్ యంత్రం కూడా ఇస్తారు. ఈ చిన్నపాటి పరికరంలో.. కూరగాయలు, పండ్లు తరిగినప్పుడు మిగిలిన చెక్కులు, ముక్కలు, కోడిగుడ్డు పెంకులు, పాచిపోయిన అన్నం, రాలిన ఆకుల్లాంటి వాటితో పాటు.. సంస్థ ఇచ్చే కంపోస్ట్ మిక్స్‌ను వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు గిరగిరా తిప్పాలి. అలా వారం రోజులు చేస్తే కంపోస్ట్ ఎరువు తయారైపోతుంది. ఎరువు తయారీలో ఇబ్బంది పెట్టే దశ.. దుర్వాసన. ఆ సమస్య ఇక్కడ ఉండదు. వీ హబ్ స్టార్టప్‌గా అభివృద్ధి చెందిన ఈ సంస్థ తయారుచేసే కిట్ విలువ మూడున్నరవేలు. హైదరాబాద్ ఉప్పల్‌లోని కూరగాయల మార్కెట్లో వెప్రా ప్లాంట్ పిట్ కంపోస్టర్‌ను పైలట్ ప్రాజెక్టుగా నెలకొల్పారు. ఇక్కడ కూరగాయల వ్యర్థాల నుంచి కంపోస్ట్ ఎరువు తయారవుతున్నది. ‘మా అధ్యయనం ప్రకారం మన ఇంట్లో నుంచి బయటికి వెళ్లే చెత్తలో 60 శాతం ఆర్గానిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. వాటిని ఎరువుగా మారిస్తే మొక్కలకు ఉపయోగపడుతుంది. అందుకే నా ఆలోచనను నలుగురికీ ఉపయోగపడే స్టార్టప్‌గా మలిచాను’ అంటారు పావని.
Read More :
“ట్రాన్స్జెండర్ల సమస్యలపై పోరాడుతున్న డాక్టర్ త్రినేత్ర.. ఎవరీమె !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Entrepreneur
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

