అన్ని స్మార్ట్ఫోన్లు ఇంచుమించు ఒకేలా కనిపిస్తుంటాయి. ఒకే రకమైన ఆప్షన్స్‌తో అలరిస్తుంటాయి. కొన్ని మాత్రం అంతకుమించి అనేలా ఉంటాయి. అలాంటిదే ఓకిటెల్ WP200 Pro 5G. ఈ రగ్డ్ ఫోన్ కాస్త హెవీగా కనిపిస్తుంది. కానీ, దాంట్లోనే ఓ ప్రత్యేకత ఉంది. దీని కెమెరా బంప్లో ఒక రహస్యం దాగి ఉన్నది. జేమ్స్‌బాండ్ సినిమాలో హీరో వాడే యాక్ససరీస్లా ఉంటుందన్నమాట! ఫోన్ వెనుక ఉన్న బంప్లో చిన్న డిస్ప్లే కనిపిస్తుంది. దాన్ని బయటికి తీసి చెవికి ధరిస్తే ఇయర్బడ్లా పనిచేస్తుంది. మణికట్టుకు పెట్టుకుంటే.. స్మార్ట్‌వాచ్‌లా మారిపోతుంది. ఇయర్‌బడ్స్ ప్రత్యేకంగా ఉంటే.. వాటి కేస్ మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి ఆ సమస్య ఉండదు. కెమెరా బంప్లో ఉంచేస్తే చాలు… మళ్లీ చార్జింగ్ అవుతుంది. ఇక స్మార్ట్‌వాచ్ సంగతి సరేసరి! టైమ్ చూసుకోవచ్చు, యాక్టివిటీస్ ట్రాక్ చేయొచ్చు. చూడటానికి అన్ని స్మార్ట్వాచ్ల్లానే ైస్టెలిష్‌గా కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. మీడియాటెక్ 8200 ప్రాసెసర్ ఉంది. 24GB ర్యామ్, 108MP కెమెరా కూడా ఉన్నాయి. ‘ఏఐ’ సపోర్ట్ ఉంది. 5జీ నెట్వర్క్ని సపోర్ట్ చేసే ఈ ఫోన్ తెర పరిమాణం 6.7 అంగుళాలు. బ్యాటరీ సామర్థ్యం 8,800 ఎంఏహెచ్. ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం 1టీబీ. ఆండ్రాయిడ్ 15 ఓఎస్ వెర్షన్‌తో పనిచేస్తుంది.