తన ఐకానిక్ డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో సంచలనం సృష్టించింది లండన్‌కు చెందిన నథింగ్ సంస్థ. తన సరికొత్త సిరీస్-3లో మరో సమ్‌థింగ్ స్పెషల్ ఫోన్‌ను తీసుకొస్తున్నది. డిఫరెంట్ లుక్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ టెక్ దిగ్గజం.. ఈ సరికొత్త ఫోన్‌ను బడ్జెట్లోనే అందించనున్నది. అత్యాధునిక ఫీచర్లతో ‘3(ఏ) లైట్’కు రూపకల్పన చేసింది.
ఈ సరికొత్త ఫోన్ కూడా.. తన బ్రాండ్‌కే ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ డిజైన్‌తోనే రాబోతున్నది. ఇందులో తన ఐకానిక్ ఎల్ఈడీ లైట్‌ను ప్యానెల్ దిగువన ఉంచింది. ఈ లైట్.. నోటిఫికేషన్, కాల్ అలర్ట్‌గా పనిచేస్తుందని, నథింగ్ సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ను మరో మెట్టు ఎక్కిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫీచర్ల విషయానికి వస్తే..
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 2.5 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో జెన్-జీ వేగానికి తగ్గుట్టుగా పనిచేస్తుంది. 8 జీబీ ఫిజికల్ ర్యామ్‌తోపాటు మరో 8 బీజీ వర్చువల్ ర్యామ్ ఉండబోతున్నది. 6.77 అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల.. ఎలాంటి గేమ్స్ అయినా చాలా స్మూత్‌గా రన్ చేస్తుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుండగా.. దానిని 2 టీబీ వరకూ పెంచుకునే అవకాశం ఉన్నది.
4జీ, 5జీ కనెక్టివిటీతోపాటు బ్లూటూత్-5.3, వైఫై, యూఎస్బీ-సి 2.0లాంటి అధునాతన ఫీచర్లు సరేసరి. ఇక దీని బ్యాటరీ సామర్థ్యం.. 5000 ఎంఏహెచ్. 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండబోతున్నది. కెమెరాల విషయానికి వస్తే.. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తున్నది. దీంతో 4కేలో వీడియో రికార్డ్ సౌలభ్యం కూడా లభించనున్నది.
సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటుచేశారు. ఆండ్రాయిడ్ -15పై నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెక్యూరిటీ ఫీచర్లో భాగంగా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అందిస్తున్నారు. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దిన నథింగ్ ఫోన్ 3(ఏ) లైట్.. దాదాపు రూ.20,000 వరకూ ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.