ఇండియన్ యాక్సెలరేటర్.. కొత్త ఆలోచనలతో వచ్చే స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఓ వేదిక. మోనాసింగ్ దాని సహ-వ్యవస్థాపకురాలు. ఐఏంజెల్స్ పేరుతో ఈ నెట్వర్క్ పనిచేస్తుంది. గత ఏడాది ముప్పైకి పైగా అంకుర సంస్థలకు మోనా నేతృత్వంలోని ఈ నెట్వర్క్ సహకరించింది. నిధులు సమకూర్చింది. ఫిన్‌టెక్, గేమింగ్, మొబైల్ టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన స్టార్టప్స్‌కు సహకరించింది. ‘ఏడాది చివరినాటికి వంద స్టార్టప్స్‌కు ఆసరా అందించాలనేది మా లక్ష్యం’ అంటారు మోనాసింగ్. గతంలో ఆమె ‘విష్-ఎ- మిత్’్ర పేరుతో బహుమతుల ఎంపికలో సహకరించే కంపెనీని నిర్వహించారు.
ఓ ఇంటర్వ్యూలో ‘మీ జీవిత కథలో హీరో ఎవరు?’ అనే ప్రశ్నకు ‘నా కథలో నేనే హీరో. నేనే పోరాడతాను. నేనే గెలుస్తాను’ అంటూ జవాబిచ్చారు మోనా. తను ఢిల్లీలోని వెంకటేశ్వర కాలేజ్‌లో గణితం ప్రధానంగా డిగ్రీ చదివారు. ఆ తర్వాత ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. గ్రేప్సిటీ, యునైటెడ్ హెల్ప్గ్రూప్ తదితర కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు.