తొమ్మిదో రోజు ప్రయాణం చేయొచ్చా?
కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలే తిథులు. చాంద్రమానంలో తొమ్మిదో తిథి నవమి. ఈ తిథి శుభకార్యాలకు పనికిరాదని చెబుతారు. వివాహానికి మినహాయింపు ఉంది. నవమి విషయంలో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అని ధర్మశాస్త్రం మూడు రకాలుగా వివరించింది
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?
కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలే తిథులు. చాంద్రమానంలో తొమ్మిదో తిథి నవమి. ఈ తిథి శుభకార్యాలకు పనికిరాదని చెబుతారు. వివాహానికి మినహాయింపు ఉంది. నవమి విషయంలో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అని ధర్మశాస్త్రం మూడు రకాలుగా వివరించింది. పుట్టింటికి వెళ్లినా, మరెవరైనా బంధువుల ఇంటికి వెళ్లినా తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం చేయరాదనేది ప్రయాణ నవమి నియమం. ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి తొమ్మిదో రోజు తిరిగి ఇంటికి రాకూడదని ప్రవేశ నవమి హెచ్చరిస్తుంది. అలాగే నవమి తిథి నాడు ప్రయాణాలు చేస్తే కష్టనష్టాలు ఎదురవుతాయని ప్రత్యక్ష నవమి చెబుతుంది. అందుకే నవమి తిథిని ప్రయాణాలకు నిషేధించారు. ఆడపడుచును పార్వతీదేవిగానూ, లక్ష్మీదేవిగానూ భావించడం మన సంప్రదాయం. నవమి తిథి అధిష్ఠాన దేవత దుర్గాదేవి. శక్తికి ప్రతిరూపమైన ఆడపడచును అత్తవారింటికి ఆడపిల్లను పంపుతూ ఆమె ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లి పుట్టినింటికీ, మెట్టినింటికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు. ప్రయాణ నవమిగా చెప్పుకొనే తొమ్మిదో రోజు ఆడకూతురును అత్తగారింటికి పంపించడం వల్ల సమస్యలు ఎదురవుతాయని విశ్వసిస్తారు. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ప్రయాణం మంచిదికాదనే విశ్వాసం ఏర్పడింది.
- డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Doubt
- Traditional
- travel
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

