Nargis Fakhri | కొంత విరామం కోసం అమెరికా వెళ్లిన నర్గీస్ ఫక్రీ ఇండియాకు తిరిగొచ్చింది. ఈ వార్త సామాజిక మాధ్యమాలకు చేతినిండా పని కల్పించింది. దీంతో కొత్తకొత్త పుకార్లు సృష్టించేశారు. ఇదంతా చూసి ఫక్రీ ఫక్కున నవ్వుకుంది. ‘శునకానందం కోసం ఎన్ని అబద్ధాలైనా రాస్తారు. నేను అవేవీ పట్టించుకోను. దీనివల్ల వాళ్లకు ఆనందం కలుగుతుందంటే కలగనివ్వండి’ అంటున్నది.
‘సెలబ్రిటీల ప్రేమల గురించే కాదు, వాళ్ల శరీరాల గురించీ మాట్లాడుకుంటారు. అనుకోకుండా నాకు విరామం వస్తే.. ప్రసూతి విశ్రాంతి అని తేల్చేశారు. నేను గర్భిణినని ప్రచారం చేశారు. వాస్తవానికి అప్పుడు నేను కొంత బరువు పెరిగాను. ఫలితంగా బాడీ షేమింగ్ కూడా ఎదుర్కొన్నాను. ఆ అనుభవం నుంచీ ఓ పాఠం నేర్చుకున్నాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఫేక్ న్యూస్‌పై పోరాటానికి సిద్ధం అవుతున్నది ఫక్రీ.
“Nargis Fakhri | వాళ్లతో పడుకోలేదనే ఆఫర్లు లేకుండా చేశారు”
Nargis Fakhri | మెరిసే డ్రెస్‌లో నర్గీస్ ఫక్రీ అందాల ఆరబోత..”