నాన్న ఏం చేసినా ఆమెకు నచ్చదు.. చక్కగా తయారైనా అనుమానమే!
ముందు నుంచీ అంతే. నాన్న ఏం చేసినా ఆమెకు నచ్చదు. చక్కగా తయారై ఆఫీసుకు బయల్దేరినా అనుమానపు చూపులే. ఓ గంట ఆలస్యంగా వస్తే రాద్ధాంతం చేస్తుంది. ఆ వివాదంలోకి నన్నూ లాగాలని చూస్తున్నది. నాన్న కదలికలపై కన్నేసి ఉంచమని పురమాయిస్తున్నది. ఇదంతా నాకు ఇష్టం లేదు.
ముందు నుంచీ అంతే. నాన్న ఏం చేసినా ఆమెకు నచ్చదు. చక్కగా తయారై ఆఫీసుకు బయల్దేరినా అనుమానపు చూపులే. ఓ గంట ఆలస్యంగా వస్తే రాద్ధాంతం చేస్తుంది. ఆ వివాదంలోకి నన్నూ లాగాలని చూస్తున్నది. నాన్న కదలికలపై కన్నేసి ఉంచమని పురమాయిస్తున్నది. ఇదంతా నాకు ఇష్టం లేదు. ఆ మాటే చెప్పాను. అప్పటినుంచి కక్షగట్టినట్టు ప్రవర్తిస్తున్నది. నన్నేం చేయమంటారు? అమ్మ వైపా, నాన్న వైపా?.. ఎటుపక్కన నిలబడాలి.
-ఓ పాఠకురాలు
మీరు ఎవరి వైపూ నిలబడాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా వ్యవహరించండి. మీ జీవితాన్ని మీరు నిర్మించుకోండి. ఓ దగ్గర కూర్చుని వివాదం పరిష్కరించుకోమని ఇద్దరికీ సలహా ఇవ్వండి. ఎంతకాలమని గొడవపడుతూ బతుకుతారు. అదే సమయంలో అమ్మ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఒంటరితనం భయంకరం. నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిస్తే తట్టుకోవడం కష్టం. తనకు ధైర్యం చెప్పండి. మీతో అయినా మనసు విప్పి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఆమెకు మాత్రం ఎవరున్నారు? నిజంగానే, మీ నాన్నను అనుమానించాల్సిన పరిస్థితులు ఉన్నాయా? ఓ కూతురిగా మీకు ఇప్పటికే నిజానిజాలు అర్థమై ఉంటాయి. అది నిరాధారమైన ఆరోపణ అయితే.. మీ అమ్మగారిని ఓసారి మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్లండి. నాన్న వక్రబుద్ధికి తగిన ఆధారాలు ఉంటే మాత్రం.. కుటుంబ పెద్దల ముందు ఆయన్ను నిలదీసే అవకాశం కల్పించండి. అదే సమయంలో మీ కెరీర్‌ను, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

