‘తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం… చలన చిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం’ అని పెళ్లిసందడి సినిమాలో వేటూరి అన్నట్టే ఫ్యాషన్ పండుగలో తారలెందరు ఉన్నా తళుకుల తార మాధురీనే! ఆరు పదుల వయసులోనూ మాధురి షో స్టాపర్‌గా నిలిచి అలరించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్త కలెక్షన్ ‘లైట్ సాంగ్’ని ముంబైలో ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు.
ఈ లైట్ సాంగ్ షోకి మానుషీ చిల్లర్, శోభితా ధూళిపాళ, నుపుర్ సనన్, సాన్యా మల్హోత్ర మరెందరో బాలీవుడ్ భామలే కాదు మాడళ్లూ వచ్చారు. అయితే, మాధురీ ఎంట్రీతో ఆ షో సీన్ మొత్తం మారిపోయిందట. బాలీవుడ్‌ని ఏలుతున్న బ్యూటీలను పక్కన నెట్టి మెరిసిపోయిన మాధురిని చూసి చెక్కు చెదరని చక్కెర శిల్పంలా ఉందని చూసినవాళ్లంతా ఆశ్చర్యపోయారట!