Jasmine Farming| మల్లెల సాగుతో డబ్బుల ముల్లెలు దించుతున్న లాయర్..

ఆమె లాయర్. వ్యవసాయం అంటే ఇష్టం. కానీ, సాగు చేయడానికి పొలం లేదు. లేకపోతేనేం, మనసుంటే డాబాపైనా సేద్యం చేయవచ్చు. మల్లెల సాగుతో డబ్బుల ముల్లెలు దించుతున్నది కిరణ దేవడిగ.
మంగళూరుకు చెందిన కిరణ దేవడిగ న్యాయవాది. వ్యవసాయం చేయాలని ఆమె కోరిక. కానీ జానెడు భూమి కూడా లేదు. ఇప్పటికిప్పుడు ఎకరమో రెండెకరాలో కొనే పరిస్థితీ లేదు. ఎక్కడైనా కౌలుకు తీసుకుందామని అనుకుంది. ఇంట్లోవాళ్లు ఆసక్తి చూపలేదు. ఆ ఆలోచనా విరమించుకున్నది. డాబా మీద సరదాకు మూడు మల్లె మొక్కలు పెంచుకున్నది. ఆ పరిమళాలను ఆస్వాదిస్తూ సృజనాత్మక వ్యాపారం గురించి ఆలోచించేది. అప్పుడే, ఒక ఐడియా వచ్చింది. ‘మల్లె మొక్కలు పెంచితే ఎలా ఉంటుంది?’ అనుకున్నది. వెంటనే భర్త మహేశ్‌కు చెప్పింది. ‘పూల గురించి కాదు, కేసుల గురించి ఆలోచించు’ అన్నాడు. చెల్లెండ్ల సలహా అడిగింది. ‘లాయరమ్మగారు మల్లెపూలు అమ్ముతారట.. ఆ మల్లెపూలమ్మా మల్లేపూలేయ్’ అంటూ వెక్కిరించినట్లు మాట్లాడారు.
శంకరపురం మల్లెలు
అలా, అన్ని వైపుల నుంచీ నిరాశే. దీంతో, ఆన్లైన్లో టెర్రస్ గార్డెనింగ్ గురించి తెలుసుకున్నది. ‘శంకరపుర మల్లిగె’ రకాన్ని ఎంచుకున్నది. మొత్తం 90 మొక్కలను, వంద కుండీలను కొనుగోలు చేసింది. మూడు నెలలు గడిచాయి. మల్లెపంట విరగపండింది. ఈ సీజన్లో ఖర్చు పన్నెండు వేలు. సంపాదన ఎనభై అయిదు వేలు. పట్టుదలతో అనుకున్నది సాధించిన కిరణను బంధువర్గమంతా ఆకాశానికి ఎత్తేస్తున్నది. ‘మా కిరణ మనసు మల్లె’ అంటున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- flower farming
- jasmine
- lawyer
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

