Lattera 35 typewriter | అప్పట్లో పదో తరగతి కాగానే అందరూ టైపింగ్ నేర్చుకునేవాళ్లు. పెద్ద ఉద్యోగం రాకపోయినా టైపిస్ట్ కొలువైనా దొరక్కపోతుందా అన్న ఆశ. దానికోసం ఇన్స్టిట్యూట్లకు వెళ్లి మరీ ఏ.ఎస్.డీ.ఎఫ్.. అంటూ కీబోర్డుతో కుస్తీ పట్టేవాళ్లు. అప్పట్లో అన్ని కార్యాలయాల్లో టైప్రైటర్లతోనే పని జరిగేది. ఇప్పుడు ఆ స్థానంలో కంప్యూటర్లు వచ్చేశాయి. అయినా చాలామందికి టైప్రైటర్లపై ప్రత్యేక అభిమానం. ఈతరం వాళ్లు కూడా వింటేజ్ టైప్రైటర్లను ఆన్లైన్లో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ‘లట్టేరా 35 ( Lattera 35 typewriter )’ టైప్‌రైటర్‌కు డిమాండ్ బాగా పెరిగింది. 1974లో స్పెయిన్‌కు చెందిన ఓలివెట్టి కంపెనీ వీటి తయారీని మొదలు పెట్టింది. డిజైన్ మాత్రం ఇటలీ కంపెనీ మారియో బెల్లినీ అందించింది. ప్లాస్టిక్, మెటల్, రబ్బర్‌తో రూపొందించిన ఈ పోర్టబుల్ టైప్‌రైటర్ కీబోర్డ్‌లో క్రీమ్ కలర్ కీలు ఉంటాయి. ఒక కీ మాత్రం ఎరుపు. ప్లాస్టిక్ క్యారీ కేస్ కూడా దీంతో లభిస్తుంది.
ఆన్లైన్లో ధర రూ. 41,175.
కొసమెరుపు: అప్పట్లో చాలా ప్రేమకథలు టైప్ ఇన్స్టిట్యూట్లోనే మొదలయ్యేవి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళన చేశారు.. కానీ..