జూన్ అంటున్నది.. హ్యాపీ జర్నీ!
జర్నీ అనగానే ఉత్సాహం వస్తుంది. ఇక లాంగ్ జర్నీ అంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది! ఇది లాంగ్ జర్నీ సీజన్. రోడ్ ట్రిప్ వేయాలని కోరుకునే బైకర్స్కే కాదు కార్ల ఓనర్లూ కూడా ప్రకృతిని చుట్టివచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు.
జర్నీ అనగానే ఉత్సాహం వస్తుంది. ఇక లాంగ్ జర్నీ అంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది! ఇది లాంగ్ జర్నీ సీజన్. రోడ్ ట్రిప్ వేయాలని కోరుకునే బైకర్స్కే కాదు కార్ల ఓనర్లూ కూడా ప్రకృతిని చుట్టివచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. దేశంలో లాంగ్ జర్నీకి జూన్ అంత అనుకూలమైన కాలం మరోటి లేదు. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి దక్షిణాదిన ఉన్న పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల వరకు అన్నీ చూసేందుకు ఇదే అనువైన సమయం. చిరు జల్లులు తప్ప వరదలు పోటెత్తే వర్షాలుండవు. వేసవికి ఆవిరైన మంచు తెరచిన దారులు హిమాలయ పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. సముద్ర మట్టానికి 16,040 అడుగుల ఎత్తుకు తీసుకుపోయే ‘బరాలచ లా’ రోడ్డు మార్గంలో మనాలి నుంచి లేహ్‌కు ప్రయాణించేందుకు ఎంతోమంది పర్యాటకులు ఈ నెలలో బయలుదేరతారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ రోడ్లపై ఉండే మంచుని జూన్ మాసంలో పూర్తిగా తొలగిస్తుంది. పర్యాటకులు మనాలి నుంచి లేహ్‌కు ఎంతో ఆనందంగా ప్రయాణం చేసి రావొచ్చు.
జూన్ మాసంలో రోజులో దాదాపు 12 గంటలపాటు పగటి వెలుతురు ఉంటుంది. కాబట్టి ఈ నెల రోడ్ ట్రిప్ వేసేవారికి అనువైనది. పశ్చిమ కనుమల్లో బెంగళూరు నుంచి కూర్గు, చిక్మంగళూరు ప్రాంతాల్లో రుతుపవనాలు చిరుజల్లులు కురిపిస్తుంటాయి. అడవి, మైదానాలు పచ్చబడి భలే అందంగా మారిపోయే కాలం ఇది. ఇక మలుపులతో ఉండే రోడ్డులో అప్ అండ్ డౌన్ ప్రయాణం వింతగా ఉంటుంది. ఈ ప్రయాణానికి కోయంబత్తూరు పొలాచ్చి మీదుగా వల్పరాయ్ ప్రయాణం కొత్తగా ఉంటుంది. తొందరగా ప్రయాణం పూర్తి చేయాలంటే ముంబై నుంచి లూనావాలా ఎంచుకుంటే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. మధ్యలో మహాబలేశ్వరం చూసిరావొచ్చు. ఇంకెందుకు ఆలస్యం విమానాల టికెట్స్ బుకింగ్ సమస్య లేదు, అనుమతులు అవసరమే లేని ప్రయాణం కదా! చలో…!!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

