బొటాక్స్ మంచిదేనా?
మేడమ్ నమస్తే. ఈ మధ్య బొటాక్స్ గురించి చాలా చర్చ జరుగుతున్నది. నేనూ చేయించుకోవచ్చా? ఎంత సురక్షితం? మీ సలహా.
మేడమ్ నమస్తే. ఈ మధ్య బొటాక్స్ గురించి చాలా చర్చ జరుగుతున్నది. నేనూ చేయించుకోవచ్చా? ఎంత సురక్షితం? మీ సలహా.. – ఓ పాఠకురాలు
బొటులినమ్ టాక్సిన్ (బీటీఎక్స్) అనేది.. క్లోస్ట్రిడియం బొటులినమ్ అనే బ్యాక్టీరియా నుంచి తయారైన ఎక్సో
టాక్సిన్. దీన్ని ల్యాబ్‌లో అభివృద్ధి చేస్తారు. చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచే ప్రక్రియ ఇది. అలా అని వృద్ధులకే పరిమితం కాదు. రెండుపదుల వయసు దాటిన ఎవరైనా బొటాక్స్ ఇంజెక్షన్లు చేయించుకోవచ్చు. నుదుటి మీద, కళ్ల చుట్ట్టు, ముక్కు చుట్టు, నోటి చుట్టు, మోచేతుల దగ్గర ముడతలను నివారిస్తుంది. హైపర్ హైడ్రోసిస్ చికిత్సకూ ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.
చేతులు, చంకలు, పాదాల దగ్గర అధికంగా చెమట పట్టడం ఈ రుగ్మత లక్షణం. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కండరాల వ్యాధిగ్రస్థులు, కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉన్నవారు బొటాక్స్‌కు దూరంగా ఉండటమే మేలు. అరుదుగానే అయినా బొటాక్స్ వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయి. ఇంజెక్షన్ చేసిన చోట రక్తస్రావం, తీవ్ర నొప్పి, నోరు ఎండిపోవడం, కళ్లు మూతపడటం.. తదితర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారం నుంచి ఏడు రోజుల తర్వాత బొటాక్స్ ప్రభావం తెలు స్తుంది. పెండ్లి, రిసెప్షన్ తదితర వేడుకలకు సిద్ధం అయ్యేవారు ఆ వ్యవధికి ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఆ ప్రభావం మూడు నుంచి ఆరు నెలల వరకూ ఉంటుంది. కానీ ఒక హెచ్చరిక.. బొటాక్స్ ఇంజెక్షన్లను నిపుణులైన కాస్మొటిక్ సర్జన్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
– డాక్టర్ అనున్యా రెడ్డి
కాస్మొటిక్ సర్జన్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

