మన శాస్త్రం.. ఘన వైద్యం!
పారిశ్రామిక విప్లవం తర్వాత కనుగొన్న వైజ్ఞానిక శాస్ర్తాలన్నీ ద్రవ్యం, శక్తి మీద ఆధారపడి ఉన్నాయి. బాహ్యంగా కనిపించే లక్షణాలన్నీ భౌతిక శాస్త్రంగా, అంతర్గత రసాయనిక చర్యలన్నీ రసాయన శాస్త్రంగా అవతరించాయి.
పారిశ్రామిక విప్లవం తర్వాత కనుగొన్న వైజ్ఞానిక శాస్ర్తాలన్నీ ద్రవ్యం, శక్తి మీద ఆధారపడి ఉన్నాయి. బాహ్యంగా కనిపించే లక్షణాలన్నీ భౌతిక శాస్త్రంగా, అంతర్గత రసాయనిక చర్యలన్నీ రసాయన శాస్త్రంగా అవతరించాయి. తక్షశిల, అలెగ్జాండ్రియా, బాగ్దాద్, నలంద, నాగార్జునకొండ ప్రాంతాల విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల్లో పోగుబడిన విజ్ఞాన శాస్త్ర గ్రంథాల ప్రయోగశాలలకు లోనై ఎన్నో కొత్త కొత్త ఆవిషరణలకు కేంద్రం అయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయ వైజ్ఞానిక శాస్ర్తానికి… భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం మూల స్తంభాలు.
ఆయుర్వేద శాస్ర్తానికి మూలమైన చరకుడు, శుశ్రుతుడు, వాగ్భటుడు ఎన్నో శాస్త్ర విషయాలను రచించారు. వైశేషకుడు, కణాదుడు, కపిలుడు, నాగార్జునుడు లైఫ్ సైన్సెస్ గురించి వారి పుస్తకాలలో సూత్ర బద్ధంగా రాశారు. ఇవి ఆయుర్వేద వైద్యశాస్ర్తానికి అత్యంత కీలకమైనవి. వైద్య శాస్త్రంలోని ప్రతి అంశంలో కార్య కారణ సంబంధాన్ని శాస్త్రీయ బద్ధంగా చెప్పడానికి న్యాయ శాస్ర్తాన్ని తోడుగా తీసుకున్నాయి. అయితే అరిస్టాటిల్ రచనలలో కొంతవరకు పైన చెప్పుకొన్న విజ్ఞాన శాస్త్ర భావనలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
వాటిని శాస్త్రీయ బద్ధంగా నిగ్గు తేల్చడానికి ప్రయోగశాలలకు లోనయ్యాయి. అకడి నుంచి గెలీలియో, కోపర్నికస్, న్యూటన్, లెవాయిజర్, ఫెడ్రిచ్ వాలెర్ లాంటివారి, లీవెన్ హాక్, లూయిస్ పాశ్చర్, బాయిల్ లాంటివారు పూర్వపు విజ్ఞానానికి భిన్నంగా ఎన్నో ఆవిషరణలు చేశారు. దాంతో విజ్ఞాన శాస్ర్తాలలో నూతన పంథా ప్రారంభమై అది క్రమంగా మోడరన్ సైన్స్‌గా రూపాంతరం చెందింది. దీనికి మధ్యయుగాలలో స్పెయిన్‌లోని కార్డోబా నగరంలో డాక్యుమెంట్ ఆఫ్ రీజన్స్ రూపొందడానికి అరబ్బుల ద్వారా అందిన భారతీయ ఆయుర్వేదం, విజ్ఞాన శాస్ర్తాలు ఎన్నో ప్రశ్నలను అడిగి, ఒక పెద్ద విప్లవాన్ని తీసుకువచ్చాయి. దాంతో అరిస్టాటిల్ చెప్పిన ఎన్నో అంశాలు సత్యం కాదని తేలిపోయాయి.
అయితే ఆయుర్వేద వైద్యంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాల సిద్ధాంతం, పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశంతో కూడిన పంచభూత సిద్ధాంతం త్రిదోషాలకు కారణమైంది. ఇవి శరీరంలో అత్యంత సూక్ష్మమైన కణంలో కూడా ఉంటాయి. ఈ Biological forces చైతన్యాన్ని క్రియేట్ చేయడంలో కీలకమై సెల్ మెటబాలిజానికి కారణమవుతాయి. వయసుతోపాటు శారీరక ఎదుగుదల జరుగుతున్న క్రమంలో టిష్యూ డెవలప్మెంట్కు కారణమై వివిధ అంగాలతో కూడి అస్తిత్వంలోకి వస్తుంది. దీనిని సప్తధాతు సిద్ధాంతం అంటారు. ఈ వివరణ, ఈ రకమైన లోతైన పరిశోధనకు బ్రిటిష్ పాలకులు ఇండియాలో ఉన్నప్పుడు అడ్డుకునే చట్టాలు చేసి, ఆయుర్వేదం శాస్త్రీయం కాదన్న ముద్ర వేశారు. అకడి నుంచి ఆయుర్వేదం మసక బారింది.ఈ ఆలోచనా ధోరణి వల్ల మార్పును కోరే విజ్ఞాన వాదులు బెంగాల్, చెన్నై, ముంబై, అహ్మదాబాద్ కేంద్రంగా కుంటుపడిన పరిశోధనలను పునః ప్రారంభించి నవీనతను సంతరించుకున్న ఆయుర్వేదాన్ని ప్రజలకు అందించేలా ప్రొఫెసర్ పి.సి.రే కృషి చేసి ది బెంగాల్ కెమికల్స్ లాంటి ఆయుర్వేద ఫార్మా కంపెనీని ప్రారంభించారు. కొవిడ్‌లో సైతం పని చేసిన HCQ లాంటి డ్రగ్ అప్పుడు కనిపెట్టిందే.
కాలక్రమంలో అల్లోపతి చికిత్స ఖర్చులు ఖరీదైనవిగా మారాయి. ఖరీదైన అల్లోపతి వైద్యానికి ప్రత్యామ్నాయంగా, విశ్వసనీయమైన భారతీయ వైద్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వడివడిగా ఈ వైద్యం వైపు అడుగులు వేయాలన్న ప్రజలకు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అవి మూఢ నమ్మకాలుగా మారి సామాన్యులను భయపెడుతున్నాయి. ఆయుర్వేదంలో ఉపయోగించే సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్, బంగారం, వెండి, మూలికలు లాంటి భస్మాలు ఖరీదైనవే! అల్లోపతి వైద్యంలో తగ్గని ఎన్నో రోగాలు ఇకడ తగ్గినప్పటికీ ఖరీదైనవిగా ఉండటం వల్ల చాలామంది ఆసక్తి కనబర్చడం లేదు. దీనికి తోడు రోగులు ఆయుర్వేదాన్ని చివరి ఆప్షన్‌గా ఎంచుకోవడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారుతున్నది.
ఒకప్పుడు ఆయుర్వేద వైద్యుల చేతులలోనే ఔషధాల తయారీ ఉండేది.
వారి దగ్గర మాత్రమే ఉండేవి. అవన్నీ సిద్ధ నాగార్జునుని రస ఔషధాలు. తకువ మోతాదులో అనుపానంతో చకగా పనిచేసేవి. ఇప్పుడు ఔషధాలు… వైద్యుల చేతుల్లో కాక కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. అవి వ్యాపారాలుగా మారి ప్రజల ఆలోచనలకు దూరంగా జరిగాయి. గ్లోబలైజేషన్లో భాగంగా 90వ దశకంలో కెరీర్ ప్రారంభించిన ఆయుర్వేద వైద్యులు ఎన్నో శ్రమలకోర్చి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తూనే ఉన్నారు. ఆయుర్వేదంపై అల్లిబిల్లిగా అల్లుకున్న అనుమానాలు, అపోహలు పటాపంచలు చేయడమే మా లక్ష్యం. శాస్త్రీయమైన ఎన్నో ఆయుర్వేద అంశాలను తెలియజేసి ప్రజలకు అందివ్వాలన్న సదుద్దేశంతోనే ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం. సాధారణ రోగాలు, జీవనశైలి లోపాలతో వచ్చే దీర్ఘకాలిక రుగ్మతలకు వంటింట్లో దొరికే దినుసులతో, మన అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ఔషధ మొక్కలతో వైద్యం చేసుకునే వెసులుబాటు కలగజేయడానికి వీలుగా పరిశోధనాత్మక వ్యాసాలు అందజేస్తాం. మీ సందేహాలు, అమూల్యమైన అభిప్రాయాలు ఈ వాట్సాప్ నెంబర్‌కి తెలియజేయగలరు.
-డాక్టర్ బుక్కా మహేశ్‌బాబు ఆయుర్వేద వైద్య నిపుణులు ,70328 03085
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

