Latkan Fashion | టాప్ నిండు రంగులో ఉంటే.. ప్యాంట్ లైట్ కలర్ వేస్తాం. లెహెంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే.. లేత రంగు బ్లౌజ్ ఎంచుకుంటాం. చుడీదార్ ప్లెయిన్‌గా ఉంటే గ్రాండ్‌గా అనిపించే దుపట్టా జతచేస్తాం. చీరైనా, జీన్స్ అయినా.. ఒకటి లైట్‌గా ఉంటే మరొకటి హైలైట్ అయ్యేలా జాగ్రత్తపడతాం. మొత్తానికి మన దుస్తుల్లో ఏదో ఒకటి ప్రత్యేకంగా కనిపిస్తేనే అది ఫ్యాషనబుల్‌గా ఉన్నట్టు ఫీలవుతాం. అలాంటి స్పెషల్ ఎట్రాక్షన్.. దుస్తులకు వేలాడే లట్కన్లకు పుష్కలం.
డ్రెస్ ఏదైనా.. హెవీ లట్కన్లదే ఇప్పుడు హవా! లెహెంగాకు నడుం భాగంలోనో, జాకెట్లకు వెనుక భాగంలోనో బొందులకు చివర వేలాడేలా రాళ్లూ పూసలతో రూపొందించిన లట్కన్ల ట్రెండ్ చాలా రోజులే నడిచింది. ఇప్పుడు వస్త్రంతో కుట్టిన పొడవాటి హెవీ లట్కన్లు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. రకరకాల రంగుల్లో విభిన్నమైన వస్త్రాలతో వీటిని రూపొందిస్తున్నారు. రంగుల దారాలతోనూ తయారు చేస్తున్నారు. చుడీదార్ అయినా లెహెంగా అయినా.. ట్రెండీగా కనిపించాలంటే హెవీ లట్కన్ ఉండాల్సిందే!
అతివలు అంతగా ఇష్టపడి ధరించే ఆమ్రపాలి నగల స్పెషాలిటీ ఏంటి?”
“పోనీటెయిల్ రోజూ ఒకేలా వేసుకుని బోర్ కొడుతున్నదా? ఇలా ట్రై చేయండి”
సన్నని నడుముకు వన్నెల గొలుసు.. మళ్లీ ట్రెండింగ్ అవుతున్న ఓల్డ్ స్టైల్”
“Baggy Pants | అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన ట్రెండ్ మళ్లీ వచ్చేసింది”
“Denim darzi | నయా ట్రెండ్.. చీరతో భాగమైన ఈ కొత్తరకం జీన్స్ గురించి ఐడియా ఉందా !”