ఆకలితో తలనొప్పి.. ఇలా చేస్తే బెటర్
రోజువారీ జీవితంలో తలెత్తే అతి సాధారణ ఆరోగ్య సమస్యలలో తలనొప్పి ఒకటి. దీనికి మైగ్రెయిన్ (పార్శపునొప్పి) లాంటి తీవ్రమైన సమస్య కారణం కావొచ్చు. లేదంటే ఆకలి లాంటి తేలికైన విషయం కూడా తలనొప్పికి దారితీయవచ్చు
రోజువారీ జీవితంలో తలెత్తే అతి సాధారణ ఆరోగ్య సమస్యలలో తలనొప్పి ఒకటి. దీనికి మైగ్రెయిన్ (పార్శపునొప్పి) లాంటి తీవ్రమైన సమస్య కారణం కావొచ్చు. లేదంటే ఆకలి లాంటి తేలికైన విషయం కూడా తలనొప్పికి దారితీయవచ్చు. ఆకలి వల్ల వచ్చే తలనొప్పి ఉపాహారం తీసుకోకపోవడం, ఎక్కువ కాలంపాటు తగినంత తినకపోవడం లాంటి ఆహారాన్ని దాటవేసే అలవాటు వల్ల తలెత్తుతుంది.
తీవ్రమైన భావోద్వేగాలు, నీరసం, వాతావరణ మార్పులు, నెలసరి, ప్రయాణాలు, చెవులు చిల్లులుపడే ధ్వనులు, నిద్ర తగినంత లేకపోవడం వల్ల తలనొప్పి వచ్చేవారితో పోలిస్తే కడుపు మాడ్చుకోవడం, తిండిని వాయిదా వేయడం కారణంగా తలనొప్పి 30 శాతం ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనం తేల్చిచెప్పింది.
ఇవీ కారణాలు
డీహైడ్రేషన్, తినకపోవడం, శరీరంలో కెఫిన్ లేదా గ్లూకోజ్ నిల్వలు తక్కువగా ఉండటం తలనొప్పికి దారితీస్తుంది. శరీరంలో గ్లూకోజ్ తగినంతగా లేనప్పుడు, ఆ విషయాన్ని మెదడు గ్రహిస్తుంది. దాంతో హైపోైగ్లెసీమియా (గ్లూకోజ్ స్థాయులు తక్కువవడం) నుంచి తేరుకునేందుకు మెదడు గ్లూకగాన్, కార్టిసాల్, అడ్రినలిన్ లాంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ల సైడ్ ఎఫెక్ట్‌గా నీరసం, వాంతి వచ్చినట్లు ఉండటంతోపాటు తలనొప్పి బాధిస్తుంది. ఇంకా డీహైడ్రేషన్, కెఫీన్ తగినంతగా లేకపోవడం, తిండి లేకపోవడం వల్ల మెదడు కణజాలం కుంచించుకుపోతాయి. దాంతో మెదడులో నొప్పిని గ్రహించే కండరాలు క్రియాశీలం అవడంతో తలనొప్పిగా అనిపిస్తుంది. ఒత్తిడి, డయాబెటిస్ ఉన్నవారిలోనూ తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడికి ఆకలి తోడైతే పార్శపునొప్పి గానీ, ఒత్తిడితో వచ్చే తలనొప్పిగానీ కలుగుతాయి.
జీర్ణ వ్యవస్థ సమస్యలతో…
ఒక అధ్యయనంలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా ప్రాథమిక స్థాయిలో తలనొప్పికి కారణమని తేలింది. ఈ సమస్యలకు చికిత్స తీసుకుంటే తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. అన్న వాహికకు సంబంధించిన గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), మలబద్ధకం, అజీర్ణం, జీర్ణ నాళాలకు సంబంధించిన ఇన్ఫ్లమేటరీ బోవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), పొట్టలో నొప్పి, గ్లూటెన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే సీలియాక్ డిసీజ్, బ్యాక్టీరియా వల్ల వచ్చే హెచ్.పైలోరి ఇన్ఫెక్షన్ సమస్యలకు తలనొప్పికి లంకె ఉంటుంది. ఈ సమస్యలకు చికిత్స తీసుకుంటే తలనొప్పి కూడా తగ్గిపోతుంది.
నివారణ మార్గాలు
వేళకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఉపాహారాన్ని, భోజనాన్ని తిండిని వాయిదా వేయకూడదు. బిజీ షెడ్యూల్ ఉండేవాళ్లు నియమిత వేళల్లో చిన్న మొత్తంలో ఎంతోకొంత ఆహారం తీసుకుంటూ ఉండాలి. చక్కెర ఉండే చాక్లెట్లు, తియ్యటి పానీయాలకు దూరంగా ఉండాలి. అవి శరీరంలో చక్కెర స్థాయులను పెంచి, డయాబెటిస్ ముప్పును ఎక్కువచేస్తాయి. ఆకలి బాధను నియంత్రించుకోవడానికి నీటిని ఎక్కువగా తాగాలి. యాపిల్, నారింజ పండ్లు, బాదం, జీడిపప్పు లాంటి గింజలను వెంట ఉంచుకోవాలి. యోగర్ట్ తీసుకోవాలి. చక్కెర లేని జ్యూస్‌లను ఎంచుకోవాలి. ఒకవేళ తలనొప్పికి కారణం కెఫిన్ తక్కువగా ఉండటమైతే… టీ, కాఫీ లాంటివి ఒక్కసారిగా కాకుండా, క్రమంగా మానుకునే ప్రయత్నం చేయాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

