విటమిన్ దోశ

కావలసిన పదార్థాలు
రాగులు: ఒక కప్పు, మినుప పప్పు: అర కప్పు,
శనగలు: అరకప్పు, టమాట: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, కొబ్బరి తురుము: పావు కప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక టీస్పూన్, మెంతులు: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, సోంపు: ఒక టీస్పూన్, దాల్చిన చెక్క: అంగుళం ముక్క,
లవంగాలు: రెండు, యాలకులు: రెండు, పసుపు: అర టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా,
కరివేపాకు: ఒక రెబ్బ,
వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము: ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం
ముందుగా రాగులు, మినుప పప్పు, మెంతులను బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టి మిక్సీపట్టాలి. తర్వాత, మరో మూడు గంటలు నానబెట్టాలి. బాగా నానిన పిండి మిశ్రమంలో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దోశల పిండిలా జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, అల్లం వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్‌మీద దోశల పెనం పెట్టుకొని రాగిపిండి మిశ్రమంతో దోశ వేసుకుని పైనుంచి శనగల మిశ్రమం, సన్నగా తరిగిన టమాట, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి ధనియాలపొడి వేసి బాగా కాలిన తర్వాత.. పైనుంచి కరివేపాకు, కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకుంటే చాలు. వేడివేడి మసాలాతో విటమిన్ దోశ రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

