Jalsa Movie | సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోనూ ఈ బాలుడికి అదే వ్యాధి !!
Jalsa Movie | అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘జల్సా’ చిత్రం ఉత్కంఠ భరితమైన ఇతివృత్తంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నది. విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు మూలాలున్న సూర్య కాశీభట్ల ( Surya Kasibhatla ) అనే కుర్రాడు ఆ ఇద్దరు దిగ్గజాలతో పోటీపడ్డాడు. సూర్య కుటుంబం అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడింది. ‘జల్సా’లో సూర్యది సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న ఓ కౌమార బాలుడి పాత్ర.
నిజానికి సూర్య కూడా సెరిబ్రల్ పాల్సీ బాధితుడే. సరిగ్గా నడవలేడు, మాట్లాడనూ లేడు. కానీ సినిమాలంటే ప్రాణం. నటన పట్ల మమకారం. అనుకోకుండానే ఈ అవకాశం వచ్చింది. ‘జల్సా’ దర్శకుడు సురేశ్ త్రివేణి ఓ ప్రెస్మీట్లో ‘సూర్య అద్భుతమైన నటుడు, నేను ఎప్పటికీ వదులుకోలేని కుర్రాడు. తనను మొదటిసారి కలిసినప్పుడే, నాకు ఆయుష్ దొరికాడని అనుకున్నాను’ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. విద్యాబాలన్ అయితే, ‘మా అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. సెట్స్‌లోనే కాదు, బయట కూడా మేం తల్లీబిడ్డలమే. సూర్య నటన ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది’ అంటూ వాత్సల్యాన్ని కురిపించింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో చాలా ఆనందంగా ఉన్నాడు సూర్య. తను అద్భుతంగా పియానో వాయిస్తాడు. పాటలు రాస్తాడు. సైన్స్ ప్రయోగాలపై ‘నాసా’కు ఉత్తరాలూ రాస్తుంటాడు. గొప్ప శాస్త్రవేత్త కావాలన్నది సూర్య ఆశయం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- bollywood
- jalsa
- Vidya Balan
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

