ఎన్ని సౌందర్య ఉత్పత్తులు వాడినా, మరెన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా.. ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. కొందరిలో ఈ సమస్య తక్కువగా ఉంటే.. మరికొందరిలో తీవ్రంగా ఉంటుంది. ముఖంపై కనిపించే మచ్చలు, ముడతలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ సమస్యకు మేలైన పరిష్కారం గువా షా! జపనీయులు వాడే ఈ బ్యూటీ స్టోన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. గువా షాతో మసాజ్ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని సౌందర్య నిపుణులు దీనిని సిఫారసు చేస్తున్నారు.
మీ చర్మానికి సరిపడే ఏదైనా సీరమ్‌ను ముందుగా ముఖానికి అప్లయ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన గువా షా స్టోన్‌తో మెల్లగా, మృదువుగా మసాజ్ చేయాలి. ముఖంలోని కింది భాగం నుంచి పైకి నిదానంగా రుద్దుతూ ఉండాలి.