చలికాలంలో పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ ఇన్ఫెక్షన్ను ముందుగా ఎలా గుర్తించాలి?
Pharyngitis – Sore throat | శ్వాసకోశ వ్యాధులతో డాక్టరు దగ్గరికి వెళ్లే పిల్లల్లో దాదాపు 33 శాతం మంది గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడేవారే. ముక్కునుంచి ప్రవేశించిన గాలిని, నోటిద్వారా ప్రవేశించిన ఆహారాన్ని ఆయా వ్యవస్థల ప్రారంభ భాగాలకు చేరవేసే గొట్టంలాంటి భాగాన్ని ‘ఫారింక్స్’ అంటారు. దీనికి సూక్ష్మజీవుల వల్ల వచ్చే అంటువ్యాధి పేరు.. ‘ఫారింజైటిస్’. ఇది చాలాసార్లు వైరస్ వల్ల, కొన్నిసార్లు ‘స్ట్రెప్టోకాకస్’ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వ్యాధిగ్రస్తుల తుమ్ములు, దగ్గు కారణంగా బయటికి వచ్చే తుంపర్ల ద్వారా సమీపంలోని పిల్లలకు వ్యాపిస్తుంది. వర్ష కాలం, చలికాలాల్లో ఎక్కువగా వస్తుంది.
లక్షణాలు: బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అకస్మాత్తుగా ప్రారంభం అవుతుంది. జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గొంతు తడారిపోతుంది. నీరు, ఆహారం మింగడం కష్టం అవుతుంది. దగ్గు ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు కడుపునొప్పి, గొంతు ఎర్రబడటం తదితర లక్షణాలు కనిపించవచ్చు. టాన్సిల్స్ వాచి దానిపై చీము చేరవచ్చు. మెడ ముందు భాగంలో ఉండే లింఫ్ గ్రంథులు వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగవచ్చు. ఇక, వైరస్ వల్ల వచ్చే వ్యాధి క్రమంగా ప్రారంభమౌతుంది. సాధారణ లక్షణాలతోపాటు ప్రత్యేకంగా ముక్కునుండి చీమిడి కారడం, దగ్గు, నీటి విరేచనాలు, కళ్లు ఎర్రబడటం, బొంగురు గొంతు తదితర లక్షణాలు ఉంటాయి.
వైద్యం: వైరస్ వల్ల వచ్చే వ్యాధికి ప్రత్యేకమైన మందులేవీ లేవు. వ్యాధి లక్షణాలు తగ్గడానికి మందులు వాడాలి. జ్వరం, గొంతు నొప్పికి పారసిటమాల్ (శరీరం బరువుకు తగిన డోసేజీలో)తోపాటు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి.
సమస్యలు: సమయానికి సరైన వైద్యం లభించకపోతే చెవిలో చీము, గొంతులో చీము గడ్డలకు దారితీయవచ్చు. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా గొంతు ఇన్ఫెక్షన్కు సరైన వైద్యం చేయనప్పుడు, ఆ ప్రభావం గుండెమీద పడవచ్చు. అది కాస్తా, రుమాటిక్ గుండె జబ్బుకు దారితీయవచ్చు. కిడ్నీలను ప్రభావితం చేసి ‘నెఫ్రైటిస్’కు కారణం కావచ్చు.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

