మట్టితో మెరిపిద్దాం

మట్టిలో పంటసిరులు కురుస్తాయి. మాణిక్యాలు మెరుస్తాయి. అదే మన్ను పూసుకుంటే మేనిఛాయ నిగనిగలాడుతుంది. ఆ మట్టితోనే నగలనూ తీర్చిదిద్దొచ్చు. ఆభరణాలకు అనువైన ప్లాటినం,బంగారం, వెండి వంటి ఘనమైన లోహ గనులను తన గర్భంలో దాచుకున్నమట్టికి నగల రూపంలో వగలు పోవడం ఒకరు నేర్పాలా! అందుకే, ఫ్యాషన్ ప్రపంచంలో మట్టి నగలు గట్టి పోటీనిస్తున్నాయి. ‘కాదేదీ ట్రెండ్‌కు అనర్హం’ అంటూ రకరకాల నగలను దీటుగా టెర్రకోట శైలిలో అందంగా రూపొందిస్తున్నారు డిజైనర్లు. ఈ మట్టినగల ధగధగలేంటో మనమూ చూసేద్దాం.
‘బంగారం పుట్టక ముందు, వెండి అంటే తెలియక ముందు ఆభరణాలు లేవా?’ ఈ ప్రశ్నకు సమాధానం ప్రాచీనకాలంలోనే వెలుగు చూసింది. నాగరికత ఆనవాళ్లు వెలికి తీసే క్రమంలో జరిపిన తవ్వకాల్లో మట్టితో రూపొందిన ఆభరణాలు వెలుగుచూశాయి. హరప్పా, మొహంజదారో సమాజాల్లోనూ టెర్రకోట నగల గలగలలు వినిపించాయని తెలుస్తున్నది. ఎప్పుడో ప్రాచీన కాలంలో పురుడు పోసుకున్న మట్టినగల సోయగాలు మళ్లీ నయా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. బంగారు నగలను కొనే స్తోమత లేనివాళ్లు ప్రత్యేక శైలిలో తయారైన టెర్రకోట ఆభరణాలను
ఆనందంగా ధరిస్తున్నారు. వాళ్లు మాత్రమే కాదు, బోషాణంలో ఏడు వారాల నగలున్న సంపన్నులు సైతం ఇష్టంగా కొంటున్నారు. ఆప్యాయంగా ధరిస్తున్నారు.
వెరైటీపైనే మక్కువ
సంప్రదాయ వేడుకలు, శుభకార్యాలు, పండుగలు వంటి సంబురాల్లో అందరి దృష్టీ ఖరీదైన నగలతో ముస్తాబైన వారిపైనే ఉంటుందనేది పాతమాట. ఖరీదుతో పనిలేకుండా ట్రెండ్‌కి తగ్గట్టు ప్రత్యేకమైన నగలతో అలంకరించుకుంటే అందరి చూపులు మనపైనే అనేది నేటిమాట. అందుకే, బంగారం, వెండి, వజ్రాలు వంటి ఖరీదైన నగలకంటే చౌకగా, తేలికగా తయారై ఆకర్షణీయంగా ఉండే నగలపైనే మగువలు మనసు పారేసుకుంటున్నారు. చూసేందుకు మామూలు పూసల నగల్లాగే ఉండే టెర్రకోట ఆభరణాలు చాలా ప్రత్యేకమైనవి. గోల్డ్ మిక్సింగ్‌తో రకరకాల రంగులు అద్దుకున్న ఈ నగలను స్వచ్ఛమైన మట్టితో తయారుచేస్తారు. పెద్దపెద్ద లాకెట్లు, పూసలు, బిళ్లల డిజైన్లలో రూపొందే ఈ నగలు సంప్రదాయ దుస్తులపై మరింత హుందాగా కనిపిస్తాయి. పెద్దపెద్ద పెండెంట్లు జీన్స్, స్కర్టు వంటి ఫ్యాషన్ దుస్తుల పైకీ చక్కగా కనిపిస్తాయి.
నచ్చిన డిజైన్లలో..

టెర్రకోట అంటే ‘కాల్చిన మట్టి’ అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టెర్రకోట బొమ్మలు, అలంకరణ వస్తువులను తయారుచేసే పద్ధతిలోనే రకరకాల డిజైన్లలో నగలను తయారుచేస్తున్నారు. మన దేశంలో రాజస్థాన్‌లోని పుష్కర్, పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని నిజామ్‌బాద్ టెర్రకోట నగల తయారీ కేంద్రాలుగా పేరొందాయి. ఎర్రటి బంకమట్టిని ఆభరణాల్లా మలిచి, ఆరబెట్టి, సహజపద్ధతిలో కాల్చి తయారుచేసే ఈ నగలు నిండైన రంగుల్లో చక్కగా కనిపిస్తాయి. ప్రాచీన హస్తకళల మీద ఆసక్తిగల చాలామంది ఆధునిక యువతీ యువకులు వీటిని తయారుచేసేందుకు ముందుకొస్తున్నారు. ఆంత్రప్రెన్యూర్లుగా ఈ హస్తకళను ప్రోత్సహిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపారం చేస్తున్నారు. వినియోగదారుల అభిరుచి మేరకు కస్టమైజ్డ్ ఆభరణాలనూ తయారు చేస్తున్నారు.
జాగ్రత్తగా వాడుకోవాలి
మట్టితో తయారుచేసే ఈ టెర్రకోట నగలు కుర్తాలు, చీరల మీదకి చక్కగా నప్పుతాయి. వీటిని ధరించడం వల్ల ఎలాంటి అలర్జీలు కూడా రావు! అయితే, వీటిని కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇతర నగలతో కలిపి పెట్టకుండా వీటిని ప్రత్యేకంగా భద్రపరచాలి. టెర్రకోట నగలను పెట్టుకున్నప్పుడు నీరు, ఫెర్ఫ్యూమ్ వంటివి తగులకుండా చూసుకోవాలి. వాడిన ప్రతిసారీ కాటన్ వస్త్రంతో తుడిచి భద్రపరచాలి.
సొంతంగా చేసుకోవచ్చు

మట్టితో తయారయ్యే ఈ నగలను ఇంటి దగ్గర సొంతంగా చేసుకోవచ్చు. బంకమట్టిని నచ్చిన డిజైన్లలో మలిచి రెండు రోజులపాటు ఆరబెట్టాలి. బాగా ఆరిన అచ్చులను ఓవెన్లో అయితే 220-240 డిగ్రీల వద్ద ఇరవై నిమిషాలు, కుక్కర్లో అయితే అరగంట, బొగ్గులమీద అయితే ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు వేడి చేయాలి. గట్టిపడిన మట్టి బిళ్లలకు నచ్చిన రంగులను అద్ది రంగురంగుల దారాలతో జత చేసుకుంటే సరి. సహజమైన మెరుపు కోసం మెటాలిక్, వార్నిష్, అక్విలిక్, సిల్వర్ రంగులను అద్దితే బాగుంటుంది. ప్రకృతి సిద్ధమైన రంగులను వినియోగిస్తే మరీ మంచిది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

