గోడమీద పైపులు. ఆ పైపుల్లో పచ్చని మొక్కలు. వినడానికే వినూత్నంగా అనిపిస్తున్నది కదూ! గోడల అలంకరణలో ఇదో కొత్త ట్రెండ్. లేత రంగు గోడల మీద ఈ అలంకరణ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరీ ఖరీదైన వ్యవహారమేం కాదు. కానీ, ఏ అతిథులో ఇంటికి వచ్చినప్పుడు మాత్రం.. చూపులన్నీ అటువైపే. ‘ఐడియా బాగుందే’ అన్న కాంప్లిమెంట్సూ అందుతాయి. కాకపోతే, ఇందుకోసం వేర్లు మరీ పొడుగ్గా ఉండని మొక్కలనే ఎంచుకోవాలి.