ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బేబీ టీషర్ట్నే.. ‘ఫ్రెంచ్ కట్ టీ’ అనీ పిలుస్తున్నారు. ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడవుతున్న దుస్తుల జాబితాలో దీనికి చోటు దక్కింది. నాటి అలీసియా సిల్వర్స్టోన్ నుంచి నేటి లైగర్ భామ అనన్య పాండే వరకూ వీటిని ఇష్టపడని అమ్మాయిలంటూ ఉండరు.
జీన్స్, స్కర్ట్స్ జతచేస్తే ఆ లుక్కే వేరు. వచ్చే వేసవి నాటికి ఫ్యాషన్ ప్రపంచమంతా ‘బేబీ టీస్’తో నిండిపోవడం ఖాయమని ఫ్యాషన్ ైస్టెలిస్ట్ రూబీ భాటియా జోస్యం చెబుతున్నారు.