Hot Summer | హాట్ సమ్మర్లో మీ ఇంటిని ఇలా కూల్ కూల్‌గా మార్చేసుకోండి
Hot Summer | బయట ఎండలు దంచికొడుతున్నాయి. ఇంట్లో కూర్చున్నా వేడి సెగలు వదలడం లేదు. అందరూ ఏసీలు పెట్టుకోలేరు. పెట్టుకున్నా అన్ని గదుల్లో పెట్టుకోలేరు. మరేం చేయాలి?
అనవసర వస్తువులు వద్దు: ఇంట్లో అవసరం లేని వస్తువులను తొలగించాలి. దానివల్ల ఖాళీ స్థలం పెరుగుతుంది. ఉక్కపోత తగ్గిపోయి గాలి ఆడుతుంది.
వాటర్ ఫౌంటెయిన్: మార్కెట్లో చిన్నచిన్న ఫౌంటెయిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇంట్లో కిటికీల దగ్గర, గది మూలలకు, హాలు మధ్యలో పెట్టుకోవచ్చు. ఇవి ఇంటి లోపలి గాలిలో తేమను పెంచుతాయి.
పచ్చ లైట్లు వద్దు: వేడిని పెంచే లైట్లను వాడొద్దు. అవి వర్షకాలం, శీతకాలంలో మాత్రమే మేలుచేస్తాయి. చల్లదనాన్ని పెంచే కూల్ ట్యూబ్‌లైట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.
కూల్ పెయింట్: ఇంటి పైకప్పు నుంచి వేడి కిందికి దిగకుండా కూల్ పెయింట్ వేయించవచ్చు. స్లాబు మీద అధిక ఎస్ఆర్ఐ (సోలార్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్) ఉన్న పెయింట్ వేస్తే, ఇంట్లో వాతావరణం చల్లగా ఉంటుంది.

పచ్చదనం: ఇంటి లోపల మొక్కల కుండీలు పెట్టుకోవాలి. గదికి రెండు చొప్పున ఉన్నా చాలు. ఎంతోకొంత ఉక్కపోతను తగ్గిస్తాయి. ఏపుగా ఉన్న మొక్కలను కిటికీల దగ్గర పెడితే, సూర్యరశ్మిని అడ్డుకుంటాయి.
ఎగ్జాస్ట్ ఫ్యాన్: వంటగది, బాత్రూముల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లను అమర్చాలి. అవి వేడిగాలిని ఎప్పటికప్పుడు బయటికి పంపి ఇంటిని చల్లగా ఉంచుతాయి.
Read More :
“Summer Food | సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా”
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు”
“Taati munjalu | డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!”
“పెరుగును ఇలా ఉపయోగించండి.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- ac
- cool
- Hot Summer
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

