పెరుగును ఇలా ఉపయోగించండి.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..!
ఎండాకాలంలో చల్ల చల్లని పెరుగును తింటే వచ్చే మజాయే వేరు. వేసవి తాపం తీరడంతోపాటు మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. జీర్ణ సమస్యలు తొలగితాయి. శరీరానికి చల్లదనం కలుగుతుంది.

ఎండాకాలంలో చల్ల చల్లని పెరుగును తింటే వచ్చే మజాయే వేరు. వేసవి తాపం తీరడంతోపాటు మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. జీర్ణ సమస్యలు తొలగితాయి. శరీరానికి చల్లదనం కలుగుతుంది.
అయితే పెరుగును కింద సూచించిన విధంగా ఉపయోగిస్తే.. దాంతో పలు అనారోగ్య సమస్యలు కూడా నయం చేసుకోవచ్చు. మరి పెరుగును వేటితో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందామా..!
కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.
కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి. వేసవిలో ఇలా తింటే చలువ చేస్తుంది. శరీరానికి చల్లదనం అందుతుంది.
కొంత వాము తీసుకుని ఒక కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.
ఒక కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీని వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినాలి. దీని వల్ల ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణులకు ఎంతగానో మేలు చేస్తుంది.
పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

