Family court | పెద్దల కోసం పార్కు.. పిల్లల కోసం ప్లే జోన్.. ఈ కోర్టు ప్రత్యేకతే వేరు

Family court | న్యాయస్థానం అంటే.. పాతకాలపు కట్టడాలు, చెదలుపట్టిన ఫైళ్ల దొంతర్లు, న్యాయవాదుల ఉరుకులు, లాయర్ గుమస్తాల పరుగులు, కక్షిదారుల ఏడుపులు అచ్చంగా ఇలానే ఉండాలన్న రూలేం లేదు. అసలు ఉండకూడదు కూడా. ఆ ఆవరణలో కాలుపెట్టగానే ఆడపిల్లకు పుట్టింటికి వచ్చినంత భరోసా కలగాలి. వరంగల్‌లోని ‘ఫ్యామిలీ కోర్టు’ను సకుటుంబ న్యాయస్థానంగా తీర్చిదిద్దడం వెనుక ప్రధాన ఉద్దేశం అదే.

అదాలత్… వరంగల్ నగర చారిత్రక చిహ్నం. నిజాం కాలం నుంచీ వరంగల్ అదాలత్ (కోర్టులు)కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆసఫ్‌జాహీల నాటి నిర్మాణాన్ని పరిరక్షిస్తూనే… ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మరో కొత్త భవనాన్ని నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఆవరణలోని ఫ్యామిలీ కోర్టు, పోక్సో కోర్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కోర్టుకు వచ్చే కక్షిదారుల పిల్లల కోసం అందమైన మినీ పార్కును ఏర్పాటు చేశారు. భార్యా భర్తల కౌన్సెలింగ్ కోసం రెండు చక్కని గదులను సిద్ధం చేశారు. కోర్టు అంటేనే అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లే వారికి ఏదో తెలియని ఆందోళన. ఈ కారణంగానే చాలా మంది బాధితులు విచారణ కోసం కోర్టు చుట్టూ తిరిగేందుకు విముఖత చూపుతారు. వరంగల్ కోర్టు ఆ పరిస్థితిని మార్చింది. మన ఇంటి వాతావరణమే అక్కడా కనిపిస్తుంది.

చిన్నచిన్న కారణాలతో విడిపోతున్న కుటుంబాలు ఈ కోర్టుకు వచ్చి కొంతసేపు కూర్చుంటే చాలు.. మళ్లీ కలిసిపోవాలనే ఆలోచన వస్తుంది. అనివార్య పరిస్థితుల్లో తల్లిదండ్రులతో కలిసి ఫ్యామిలీ కోర్టుకు వచ్చే పిల్లలు విచారణ సమయంలో ఆడుకునేందుకు వీలుగా.. క్రియేటివ్ జోన్, ప్లే జోన్ ఏర్పాటు చేశారు. లైంగిక దాడుల సమయంలో బాలికలు, మహిళల మనసులు తీవ్రంగా గాయపడతాయి. దానికితోడు సామాజిక ఒత్తిళ్లు, అనుమానపు చూపులు మేకుల్లా గుండెకు గుచ్చుకుంటూ ఉంటాయి. విచారణ కోసం న్యాయస్థానానికి రావడం ఓ పెద్ద పరీక్షే అవుతుంది. ఇక్కడ ఆ ఇబ్బంది లేదు. బాధితుల రాకపోకలకు ప్రత్యేకమైన దారి, గేటు ఉన్నాయి. వీరికంటూ విడిగా ఓ గది ఉంటుంది. కోర్టు హాలుకు, ఆ గదికి మధ్య.. గోడకు పెద్ద అద్దాన్ని అమర్చారు. బాధితురాలికి కోర్టు హాలులో ఉన్నవాళ్లంతా కనిపిస్తారు గానీ, కోర్టు హాలులో ఉన్నవారికి బాధితురాలు మాత్రం కనిపించదు. పోక్సో చట్టం ప్రధాన స్ఫూర్తికి అనుగుణంగా ఈ కోర్టును డిజైన్ చేశారు.


✍ పిన్నింటి గోపాల్
ఫొటోలు: గొట్టె వెంకన్న
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
shaik saleema | తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

