అతిసారకు.. ఆహారమే చికిత్స
నెలల వయసు పిల్లల నుంచి ఐదేండ్ల లోపు చిన్నారుల వరకూ.. బాల్యాన్ని అతిగా బాధపెట్టే వ్యాధి అతిసార. తల్లిదండ్రులు మొదట్లోనే గుర్తించకపోవడంతో కొందరు చిన్నారులు మరణపు అంచులవరకూ వెళ్తున్నారు
నెలల వయసు పిల్లల నుంచి ఐదేండ్ల లోపు చిన్నారుల వరకూ.. బాల్యాన్ని అతిగా బాధపెట్టే వ్యాధి అతిసార. తల్లిదండ్రులు మొదట్లోనే గుర్తించకపోవడంతో కొందరు చిన్నారులు మరణపు అంచులవరకూ వెళ్తున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా పిల్లల్లో వచ్చే అతిసార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవ్వాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం.
అతిసార వ్యాధి ఉన్న పిల్లలకు ఇతర వ్యాధులు కూడా రావచ్చు. వాటిలో మీజిల్స్ లేదా తట్టు, న్యుమోనియా కూడా ఉండవచ్చు.
మీజిల్స్ : ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇందులో అతిసార వ్యాధి తీవ్రంగా, ప్రమాదకరంగా ఉంటుంది. ఈ వ్యాధి రాకుండా మూడు సార్లు ఎంఎంఆర్ టీకా వేయించాలి. అతిసార వ్యాధి, మీజిల్స్ రెండిటితోనూ పిల్లలు బాధపడుతున్నప్పుడు వారికి విటమిన్-ఎ లోపాలు ఉండే అవకాశం ఎక్కువ.
న్యుమోనియా : ఇది బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి. దగ్గు, ఆయాసం, జ్వరం వ్యాధి లక్షణాలు. అతిసారతో పాటుగా న్యుమోనియా ఉన్నప్పుడు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో మరణాలు కూడా ఎక్కువే. శరీరంలో జింక్ సరైన పరిమాణంలో ఉంటే అతిసార వ్యాధి సంబంధిత మరణాల తీవ్రత దాదాపు 30 శాతం తక్కువ.
జింక్ లభించే పదార్థాలు : మరపట్టని ధాన్యాలు, చిక్కుళ్లు, మాంసం, కోడి, చేపలు. రక్తహీనత నివారించడానికి ఇనుము ఎక్కువగా ఉండే బెల్లం, ఆకుకూరలు, కాలేయం, మాంసం ఇవ్వాలి.
దీర్ఘకాలిక అతిసార వ్యాధికి : ఈ వ్యాధికి సంబంధించిన వైద్యంలో ఆహారం ప్రధానపాత్ర పోషిస్తుంది. ఆహారం ఎక్కువ పరిమాణంలో తీసుకోలేరు. కాబట్టి పోషక విలువలు ఎక్కువ ఉండి, సులువుగా జీర్ణమయ్యే సమతుల ఆహారాన్ని ఇవ్వాలి. అయితే, పిల్లల్లో జలహీనత, కడుపు ఉబ్బరం, వేగంగా బరువు తగ్గిపోవడం.. తదితర లక్షణాలను గుర్తిస్తే నిపుణుల పర్యవేక్షణలో వైద్యం చేయిం చడం సురక్షితం.

అందించాల్సిన ఆహారం
- బిడ్డ వయసు 6 నెలల కన్నా తక్కువ ఉన్నప్పుడు దీర్ఘకాలిక అతిసార వ్యాధి లక్షణాలను బట్టి ఆహారంలో మార్పులు చేయాలి.
- తల్లిపాలు పట్టడం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు.
- తక్కువ పాల ఆహారం ఇవ్వాలి (బియ్యం, రాగులు/ సగ్గుబియ్యం + పెరుగు + నూనె/ నెయ్యి + పల్చని పాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి)
- పాలు లేని ఆహారం (బియ్యం, రాగులు + పప్పు + నూనె)
- పిండి పదార్థాలు లేని ఆహారం (గ్లూకోజ్ + నూనె + మాంసకృత్తులు)
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- curd
- Dehydration
- Diarrhoea
- kids
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

