ప్రేమికుల వారోత్సవం!
ప్రేమికుల దినోత్సవానికి లవర్స్‌ను సిద్ధం చేసేందుకు కావచ్చు.. వాలెంటైన్స్ డేను ఏడు రోజుల వేడుకగా రూపొందించారు. రోజా పువ్వుతో తొలిరోజు దలవుతుంది. ఆలింగనానికి ఆరో రోజు, చుంబనానికి ఏడో రోజు కేటాయించారు. ఆ విశేషాలన్నీ..
ప్రేమికుల దినోత్సవానికి లవర్స్‌ను సిద్ధం చేసేందుకు కావచ్చు.. వాలెంటైన్స్ డేను ఏడు రోజుల వేడుకగా రూపొందించారు. రోజా పువ్వుతో తొలిరోజు దలవుతుంది. ఆలింగనానికి ఆరో రోజు, చుంబనానికి ఏడో రోజు కేటాయించారు. ఆ విశేషాలన్నీ..
రోజ్ డే (ఫిబ్రవరి 7) : వాలెంటైన్స్ వీక్ ‘రోజ్ డే’తో ఆరంభం అవుతుంది. ఇది ప్రేమికులకు మాత్రమే ఉద్దేశించిన రోజు కాదు. ఇష్టమైన ఎవరికైనా ఈ రోజున ఎర్ర గులాబీ ఇచ్చి అభిమానాన్ని వ్యక్తం చేయవచ్చు.
ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8) : మనసులోని భావాల్ని ఇష్టమైన వారికి చెప్పే రోజు. మోకాళ్ల మీద నిలబడి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రపోజ్ చేసే సుదినం. ప్రేమ, పెండ్లి ఏదైనా కావొచ్చు.. ఫలితం ఎలా ఉన్నా, ప్రయత్నమంటూ చేయాలిగా!
చాక్లెట్ డే (ఫిబ్రవరి 9): ఇష్టమైన వారికి చాక్లెట్లు ఇచ్చి తీయని వేడుక చేసుకునే సమయం. ఎలా ప్రపోజ్ చెయ్యాలో తెలియని వారికి ఇదొక సదవకాశం.
టెడ్డీ డే (ఫిబ్రవరి10): బంగారు బొమ్మలు ఇష్టపడే అందమైన బొమ్మ..టెడ్డీ బేర్. ముద్దులు మూటగట్టే కానుకను ఇచ్చి.. ముచ్చటైన ‘రిటర్న్ గిఫ్’్ట అందుకునేందుకు సిద్ధంగా ఉండండి మరి!
ప్రామిస్ డే (ఫిబ్రవరి 11): జీవితాంతం తోడుగా ఉంటామని బాసలు చేసుకునే రోజు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇష్టాలు, కష్టాలు పంచుకోండి. అండగా ఉన్నామనే ధీమా ఇవ్వండి.
హగ్ డే (ఫిబ్రవరి 12) : మాటల్లో చెప్పలేని భావాన్ని ఆలింగనం ద్వారా వ్యక్తపరిచే రోజు. ప్రేమపూర్వకమైన కౌగిలిలో కష్టాలను మర్చిపోవచ్చు. బాధలకు బైబై చెప్పొచ్చు. ప్రతిరోజునూ కొత్తగా ప్రారంభించవచ్చు.
కిస్ డే (ఫిబ్రవరి 13): ప్రేమకు, ఆప్యాయతకు, గౌరవానికి చిహ్నం ముద్దు. కల్మషం లేని ముద్దులో అమరత్వం ఉంటుంది. ‘కిస్ డే’ తొలి ముద్దుకు మొదటి అడుగు.
.. ఆ మెట్లన్నీ దాటుకుని వెళ్లాక.. చిటారు కొమ్మన మిఠాయి స్వప్నమై ఊరించే రోజు వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి14). ప్రేమికుల దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు!
‘ప్రేమ’ తెలంగాణ..
రెండో లాక్డౌన్లో మనోళ్లు ఎక్కువగా ‘ప్రేమ’ కోసం ఆరాటపడ్డారు. దూరంగా ఉన్న ప్రేయసి, ప్రియుల కోసం గూగుల్ నుంచి ప్రేమ వాక్యాలు, కవితలు, కోట్స్ కాపీ చేసుకొని.. అయినవాళ్లకు అన్వయించుకుంటూ తిరగరాసుకున్నారు. లవ్ చేయడం ఎలా? నచ్చిన అమ్మాయి ప్రేమించాలంటే ఏం చేయాలి? అంటూ గూగులమ్మను ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని ఇటీవల గూగుల్ వెల్లడించింది. తెలంగాణ నెటిజన్లు అత్యధికంగా వెతికిన పదాల్లో ‘లవ్’ మొదటిస్థానంలో ఉంది. మరింత కాలక్షేపం కోసం సినిమాల గురించి కూడా వెతికారట. తెలంగాణ ప్రజల టాప్ సెర్చ్‌లలో ‘బంగారం’ కూడా ఒకటి. ఎంతైనా తెలంగాణ బిడ్డలు ఆభరణ ప్రియులు. మన ప్రేమ కానుకలలోనూ బంగారం మొదటి స్థానంలో ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

