అమ్మో.. ఆస్తమా!
ఆస్తమా.. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. ఈ రుగ్మత పిల్లల్లో పెరుగుతున్నది. ట్రెకియో బ్రాంకియల్ భాగాలకు వచ్చే ఈ సమస్య వల్ల శ్వాసనాళాలు రకరకాల ఉత్ప్రేరకాలకు ఉత్తేజం చెందుతాయి. శ్వాస లోనికి పీల్చడం, తిరిగి బయటికి వదలడం చాలా కష్టం అవుతుంది. ఆస్తమా తరచుగా వస్తూ తగ్గిపోతూ ఉంటుంది
ఆస్తమా.. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. ఈ రుగ్మత పిల్లల్లో పెరుగుతున్నది. ట్రెకియో బ్రాంకియల్ భాగాలకు వచ్చే ఈ సమస్య వల్ల శ్వాసనాళాలు రకరకాల ఉత్ప్రేరకాలకు ఉత్తేజం చెందుతాయి. శ్వాస లోనికి పీల్చడం, తిరిగి బయటికి వదలడం చాలా కష్టం అవుతుంది. ఆస్తమా తరచుగా వస్తూ తగ్గిపోతూ ఉంటుంది. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ రుగ్మతను వెంటనే గుర్తించలేకపోతున్నారు. దీంతో చిన్నారులకు సకాలంలో వైద్యం చేయించడం లేదు. పుట్టుకతోనే కృత్రిమ శ్వాస అవసరమైన పిల్లలు, కిక్కిరిసిన నివాసాలలో ఉండే చిన్నారులు, సరైన వసతులులేని సంరక్షణ కేంద్రాలలో మనుగడ సాగించే అనాథలు, తల్లిపాలు తాగని పిల్లలు, పొగ అలవాటు ఉన్న కుటుంబాల్లో పుట్టినవారు.. ఆస్తమాకు గురయ్యే ఆస్కారం మరీ ఎక్కువ.
ఉత్ప్రేరకాలు: ఇంట్లోని దుమ్ము, ధూళిలో ఉండే డస్ట్‌మైట్ అనే సూక్ష్మజీవి, బొద్దింకలు, జంతువుల లాలాజలం, పెంపుడు జీవాల బొచ్చు వ్యాధిని తీవ్రతరం చేస్తాయి. వైరస్ సోకిన తరువాత కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌లో ఆర్ఎస్వీ, పారా ఇన్ఫ్లుయెంజా, రైనోవైరస్, జంక్
ఫుడ్స్‌లో ఉండే సల్ఫైట్స్, బెంజోయేట్స్ వంటి వాటివల్ల కూడా వ్యాధి ముదురుతుంది. చల్లగాలి, స్ప్రేలు, దోమలను పారదోలే పొగ కాయిల్స్, అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పులు, చల్లదనం వ్యాధికి ప్రధాన కారణాలు.
వ్యాధి లక్షణాలు: తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు దురద, తరచూ దగ్గు, దగ్గినప్పుడు వాంతులు, ఛాతీలోంచి శబ్దాలు, శ్వాసక్రియలో వేగం, ఛాతీ పట్టేసినట్టు అనిపించడం ముఖ్యమైన లక్షణాలు.
వైద్యం: వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. డాక్టరు సలహాపై ఇన్హేలర్లు ఉపయోగించాలి. ఇవి సురక్షితమైనవి. వీటిని వాడటం వల్ల భవిష్యత్తులో ఆ మందులకు బానిసలు అవుతారనుకోవటం అపోహ మాత్రమే.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

