బ్రిటన్ ప్రధాని రిషి విజయంలో.. అక్షత కృషి
ప్రతి మగవాడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఒక విజయం కాదు, సునాక్ అనేకానేక విజయాల వెనుక అక్షత దక్షత ఉంది. అలా అని ఆమె భర్త చాటు భార్య కాదు. తనదైన వ్యక్తిత్వం ఉంది. తనకంటూ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. విజయాల చరిత్రా ఉంది. భర్త రాజకీయ నాయకుడిగా ఎదిగేనాటికే.. అక్షత ఇంగ్లండ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త
తండ్రికి తగిన కూతురిగా.. భర్తకు తగిన భార్యగా.. ఇద్దరు బిడ్డల తల్లిగా.. వ్యాపారవేత్తగా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. బ్రిటన్ ప్రధాని సతీమణి హోదా అక్షతామూర్తికి కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
ప్రతి మగవాడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఒక విజయం కాదు, సునాక్ అనేకానేక విజయాల వెనుక అక్షత దక్షత ఉంది. అలా అని ఆమె భర్త చాటు భార్య కాదు. తనదైన వ్యక్తిత్వం ఉంది. తనకంటూ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. విజయాల చరిత్రా ఉంది. భర్త రాజకీయ నాయకుడిగా ఎదిగేనాటికే.. అక్షత ఇంగ్లండ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త. ఆమె సొంత బ్రాండ్ ‘అక్షత డిజైన్స్’ భారతీయ ఫ్యాషన్‌ను, కళల్ని ప్రపంచానికి చేరువ చేసింది. తాము రూపొందించే ప్రతి వస్త్రంలో ప్రాచీన డిజైన్ల మేళవింపు ఉండాలని కోరుకుంటారామె. అంతేకాదు, వారసత్వంగా వచ్చిన ఇన్ఫోసిన్ వాటా (0.93 శాతం) ఉండనే ఉంది. ఫిట్నెస్, రెస్టారెంట్ వ్యాపారాల్లోనూ పెట్టుబడులు ఉన్నాయి. అక్షత బాల్యమంతా బెంగళూరులోనే గడిచింది.
అచ్చమైన మధ్య తరగతి పెంపకం తనది. అలా అని సుధామూర్తి, నారాయణమూర్తి తమ కూతురికి ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు. స్వతంత్రంగా ఆలోచించడం నేర్పారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివింది అక్షత. అక్కడే రిషి సునాక్ పరిచయం అయ్యాడు. అది కాస్తా స్నేహంగా, ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. మొదట్లో రిషి అంటే నారాయణమూర్తికి పెద్దగా ఇష్టం ఉండేది కాదని చెబుతారు. అతనిలోని నిజాయతీ, కష్టపడే తత్వం చూశాక మనసు మార్చుకున్నారట. ‘అల్లుడా మజాకా..’ అని మెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. లండన్ ఇన్ఫోసిస్ శాఖ విస్తరణలో ఆ ఆలూమగల పాత్ర కీలకం. అక్షత, రిషి జంటకు ఇద్దరు కూతుళ్లు.. కృష్ణ (11), అనౌష్క (9). పిల్లల పెంపకంలో అక్షత పాత్రే ఎక్కువ.
దెబ్బతీసే కుట్ర
రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన సమయంలో అక్షతామూర్తి పన్నుల చెల్లింపు వ్యవహారం చర్చనీయమైంది. భర్త బ్రిటన్ పౌరుడే అయినా.. ఆమె మాత్రం భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత ఏటా 2.1 మిలియన్ పౌండ్ల పన్నులు ఎగవేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అక్షత ఆ విమర్శను హుందాగా స్వీకరించారు. సాంకేతికంగా తన తప్పేమీ లేకపోయినా.. భర్తకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం.. ఇకనుంచీ భారత్ నుంచి వస్తున్న సంపాదనపైనా పన్నులు కడతానని ప్రకటించి విమర్శకుల నోళ్లు మూయించారు. ‘నేనెప్పటికీ బ్రిటన్ పౌరసత్వాన్ని వదులుకోను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నా భార్య తన మాతృదేశంతో అనుబంధం తెంచుకోవాలనడం సరికాదు’ అంటూ సునాక్ భార్యకు మద్దతు పలికారు. ఒకరికొకరు.. అనే మాటకు అక్షత, రిషి దంపతులు నిలువెత్తు ఉదాహరణ. అక్షత జంతు ప్రేమికురాలు కూడా. ఆమె పెంపుడు కుక్క పేరు నోవా.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

