Soha Ali Khan | హైదరాబాద్‌తో తనది విడదీయరాని బంధమని చెబుతున్నది బాలీవుడ్ నటి సోహా అలీఖాన్. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ క్యాలిఫోర్నియా బ్రాండ్ అంబాసిడర్ హోదాలో సోహా ఇటీవలే హైదరాబాద్ వచ్చింది. ‘విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు హైదరాబాద్. నా బాల్యంలో ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాను. సినీ నటిగా మారాక షూటింగ్స్ కోసం కూడా చాలాసార్లు వచ్చాను. ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది సోహా.
వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉందంటున్నది ఆమె. ‘ఈ విషయంలో నేను కొన్నిసార్లు సక్సెస్ అవుతాను. కొన్నిసార్లు విఫలం అవుతాను. ఆధునిక జీవితంలో మల్టీటాస్కింగ్ చాలా అవసరం. కానీ, మనం చేస్తున్న పనిని ఎవరైనా నియంత్రించాలని చూస్తే మాత్రం చికాకు కలుగుతుంది’ అని పేర్కొంది సోహా. ప్రస్తుతం, తను ఆల్ ఉమెన్ వెబ్ సిరీస్ ‘హుష్ హుహ్’లో నటిస్తున్నది . కేవలం మహిళలే నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌లో భాగం కావడం గర్వంగా ఉందంటున్నదీ ముద్దుగుమ్మ.
“Runway 34 | థియేటర్లలో ఫెయిల్..కానీ ఓటీటీలో మాత్రం టాప్-1 ప్లేస్..!”