Akshay Kumar | ఈ స్టార్ హీరో ఇంప్రెస్ చేయలేకపోతున్నాడా..? వరుసగా 6 సినిమాలు అంతే..!
స్టార్ హీరో అక్షయ్‌కుమార్ (Akshay Kumar)కు కొంతకాలంగా టైం కలిసి రావడం లేదనే వార్త ఇపుడు బీటౌన్‌లో రౌండప్ చేస్తోంది. అక్షయ్ కుమార్ గత 6 సినిమాలను గమనిస్తే..బాక్సాపీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి.
బాలీవుడ్(Bollywood) లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు అక్షయ్‌కుమార్ (Akshay Kumar). అయితే ఈ స్టార్ హీరోకు కొంతకాలంగా టైం కలిసి రావడం లేదనే వార్త ఇపుడు బీటౌన్‌లో రౌండప్ చేస్తోంది. రీసెంట్గా వచ్చిన సామ్రాట్ పృథ్విరాజ్ (Samrat Prithiviraj) బాక్సాపీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడంతో విఫలమైంది. దీంతో ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. అక్షయ్ కుమార్ గత 6 సినిమాలను గమనిస్తే..బాక్సాపీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి.
లక్ష్మీ, బెల్ బాటమ్, సూర్యవంశీ, అట్రాంగి రే (ఓటీటీ), బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్విరాజ్..ఈ సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. అయితే వీటిలో కంటెంట్ పరంగా కొన్ని మంచి సినిమాలే అయినప్పటికీ వివిధ కారణాలతో ఫెయిల్యూర్ టాక్ మూటగట్టుకున్నాయంటున్నారు సినీ పండితులు. ఇలా వరుసగా సినిమాలు బోల్తా కొడుతుండటంతో..మంచి స్క్రిప్టులను ఎంపిక చేసుకోవాలని అక్షయ్‌కుమార్‌ను కోరుతున్నారు అభిమానులు.

మరోవైపు అక్షయ్ కుమార్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) హిందీ రీమేక్‌ను ఇప్పటికే ప్రటించేశాడు. దీంతోపాటు రామ్ సేతు, సెల్ఫీ, ఓఎంజీ 2 ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. తమ ఫేవరేట్ నెక్ట్స్ రాబోయే సినిమాతోనైనా హిట్టు కొడతాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

