Health Tips for Women | పీరియడ్స్ టైంలో సమస్యలా.. ఈ వర్కౌట్స్ చేయండి!
Health Tips for Women | రుతుక్రమ సమయంలో రక్తస్రావం వల్ల విపరీతమైన నిస్సత్తువ ఆవహిస్తుంది. హార్మోన్ సమస్యల వల్ల చిరాకు సహజం. ఒంటినొప్పులు, కండరాల సమస్యలూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో వ్యాయామం చేస్తే ఇబ్బందులు మరింత తీవ్రం అవుతాయనే అభిప్రాయం ఉంది.
Health Tips for Women | రుతుక్రమ సమయంలో రక్తస్రావం వల్ల విపరీతమైన నిస్సత్తువ ఆవహిస్తుంది. హార్మోన్ సమస్యల వల్ల చిరాకు సహజం. ఒంటినొప్పులు, కండరాల సమస్యలూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో వ్యాయామం చేస్తే ఇబ్బందులు మరింత తీవ్రం అవుతాయనే అభిప్రాయం ఉంది. నిజానికి, కాస్త జాగ్రత్తగా కసరత్తు చేస్తే కనుక, వివిధ రుగ్మతల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి…
- జాగింగ్, పరుగు లాంటివి ఈ సమయంలో కూడా కొనసాగించవచ్చు. కాకపోతే, వ్యాయామాలు చేసేటప్పుడు పుష్కలంగా నీళ్లు తాగాలి.
- నేలమీద బోర్లా పడుకుని మోచేతులు, కాలివేళ్ల సాయంతో శరీరాన్ని కదిలించే వ్యాయామాన్ని ప్లాంకింగ్ అంటారు. పీరియడ్స్ సమయంలో ఈ కసరత్తు వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- చిన్నపాటి యోగాసనాలు, తేలికపాటి ప్రాణాయామం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది.
- ఇష్టమైన సంగీతానికి అనుగుణంగా కాలు కదిపితే… మూడ్‌తో పాటు ఆరోగ్యమూ కుదుటపడుతుంది. పీరియడ్ అనే విషయమే మర్చిపోతారు.
- ఈత పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఉపశమనాన్ని అందిస్తుంది. కాకపోతే.. నీటిలోకి దిగేటప్పుడు మెన్స్ట్రువల్ కప్స్ లాంటివి వినియోగించాలి.నిపుణుల సలహాతో.. ఉదర సంబంధమైన వ్యాయామాలు కూడా చేయవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

