చౌచౌ (బెంగళూరు వంకాయ): ఒకటి, పెసరపప్పు: పావు కప్పు, పసుపు: పావు టీస్పూన్, ఇంగువ: చిటికెడు, జీలకర్ర: అర టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, కరివేపాకు: ఒక రెమ్మ, నిమ్మరసం: ఒక టీస్పూన్, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత.
చౌచౌను కడిగి ముక్కలుగా కోయాలి. కుక్కర్లో చౌచౌ ముక్కలు, పెసరపప్పు, పసుపు వేసి ఒక గ్లాసు నీళ్లుపోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి మెత్తగా మెదపాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, చౌచౌ మిశ్రమం, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక నిమిషంపాటు సన్నని మంటపై ఉడికించి చివరగా నిమ్మరసం జతచేస్తే వేడివేడి చౌచౌ సూప్ సిద్ధం.