మారుతున్న టెక్నాలజీ రోజుకో కొత్త స్మార్ట్ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నది. అలా వచ్చిందే ‘బీబ్యాలెన్స్’..వాటర్‌ప్రూఫ్ స్మార్ట్ బాత్మ్యాట్. స్నానాల గదిలో వాడే మ్యాట్‌కి బదులు దీన్ని ఉపయోగిస్తే లాభాలు అనేకం. దీనిపై కాసేపు నిలబడితే చాలు బరువు, బీఎమ్ఐ వివరాలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు, రోజువారీగా పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలు, వ్యాయామ పద్ధతులను వివరిస్తుంది. రోజూ స్నానం కాగానే ఈ బాత్మ్యాట్పై నిలబడటమే మనం చేయాల్సిన పని. బరువును బట్టి మనకు వ్యాయామాలు సూచిస్తుంది. మనల్ని నాజూగ్గా తయారు చేసే బాధ్యత తీసుకుంటుంది. పిల్లలకూ ఈ మ్యాట్ ఉపయోగపడుతుంది. దీనిపై కాళ్లు పెట్టగానే, వాళ్ల షూ సైజ్ తెలిసిపోతుంది. ఎదుగుదలకు సంబంధించిన వివరాలన్నీ స్పష్టంగా తెలుపుతుంది. మార్కెట్లో దీని ధర రూ.17,000 వరకూ ఉంది.