శ్రీ గౌరి నీ పూజ ఉయ్యాలో
బంగారు చెంబుల ఉయ్యాలో
జలతారు చీరలు ఉయ్యాలో
చేయబూనితిమమ్మ ఉయ్యాలో
గంగ ఉదకం తెచ్చి ఉయ్యాలో
అద్దాల రవికలు ఉయ్యాలో
కాపాడు మమ్ముల ఉయ్యాలో
కాంత నీ పాదాల ఉయ్యాలో
అద్దాల రవికలు ఉయ్యాలో
కైలాసరాణీ ఉయ్యాలో
కడిగి తరియింతుము ఉయ్యాలో
అమ్మ నీకిచ్చెద ఉయ్యాలో
శంకర పార్వతి ఉయ్యాలో
నీలకంఠపు రాణి ఉయ్యాలో
శంభునిరాణి ఉయ్యాలో
అంబికా నీకిదే ఉయ్యాలో
నీలవేణి రాణి ఉయ్యాలో
శంకర పార్వతి ఉయ్యాలో
అర్ఘ్యంబులిచ్చెద ఉయ్యాలో
ప్రేమ పువ్వుల మాల ఉయ్యాలో
శంభునిరాణి ఉయ్యాలో
ఆకాశగంగతో ఉయ్యాలో
తల్లి నిన్నెప్పుడూ ఉయ్యాలో
ఆదరించుము తల్లి ఉయ్యాలో
నీ కేసి పూజింతు ఉయ్యాలో
ధ్యానింతుమమ్మ ఉయ్యాలో
జలజాక్షి పందిట ఉయ్యాలో
జయము నీకు తల్లి ఉయ్యాలో
కలహంస నడకల ఉయ్యాలో
జలకమాడుమమ్మ ఉయ్యాలో
శుభము మాకు తల్లి ఉయ్యాలో
కలికి రాణివమ్మ ఉయ్యాలో
బంగారు చీరలు ఉయ్యాలో
జయము నీకు తల్లి ఉయ్యాలో
సింహపీఠంబున ఉయ్యాలో
శాంభవి నీకమ్మ ఉయ్యాలో
శుభము మాకు తల్లి ఉయ్యాలో.
చెలియకూర్చుండమ్మ ఉయ్యాలో
జలతారు చీరలు ఉయ్యాలో
అద్దాల రవికలు ఉయ్యాలో