అరటి పువ్వు: ఒక కప్పు, శనగపప్పు: ఒక కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి(పెద్దది), వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, జీలకర్ర, సోంపు: ఒక టీస్పూన్ చొప్పున, కరివేపాకు: రెండు రెబ్బలు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
శనగపప్పును కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. అరటిపువ్వును ఒలిచి అరగంటపాటు ఉప్పునీళ్లలో నానబెట్టి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, జీలకర్ర, సోంపు, ఉప్పు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయాలి. పప్పు మిశ్రమాన్ని గిన్నెలో వేసి చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, అరటిపువ్వు, కరివేపాకు వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక పప్పు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేతిలో వడల్లా ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే అరటిపువ్వు వడలు సిద్ధం.