తొమ్మిది రోజుల ఉపవాసాల తర్వాత పండుగనాడు ఎలాంటి పరిమితులూ లేకుండా ఇష్టమైన ఆహారాన్ని ఓ ముద్ద ఎక్కువే లాగిస్తాం. అయితే ఒక్కసారిగా పొట్టనిండా ఆరగిస్తే.. జీర్ణ సమస్యలు తప్పవు. అందుకే, కొద్దిరోజుల పాటు ఈ చిట్కాలు పాటించాలి..

ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీళ్లు తాగండి. అందులో నిమ్మకాయ పిండుకోవడం అస్సలు మరిచిపోవద్దు.
నిమ్మరసంలో పుదీనా, కొత్తిమీర కలుపుకొని తాగితే కూడా.. జీర్ణవ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది. కొత్తిమీరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
నిమ్మ, నారింజ, ద్రాక్ష రసాలు పొట్టను శుభ్రపరచడంలో తమవంతు పాత్ర పోషిస్తాయి.
పెరుగు, పనీర్ వంటివి అరుగుదలకు చక్కగా ఉపకరిస్తాయి.
మధ్యాహ్నం పూట భారీ విందు లాగించి ఉంటే రాత్రికి మాత్రం మితాహారానికే ఓటెయ్యండి.